అయోధ్య‌కేసు: కొత్త ప‌రిశీల‌కుల‌ను నియ‌మించాల‌ని అల‌హాబాద్ కోర్టుకు సుప్రీం ఆదేశం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అయోధ్య‌కేసు విచార‌ణ చివరి దశకు చేరుతున్న నేప‌థ్యంలో 10 రోజుల్లోగా అయోధ్య భూవివాదం విష‌యంలో కొత్త ప‌రిశీల‌కుల‌ను నియ‌మించాల‌ని అలహాబాద్ కోర్టును భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.

ఇంత‌కు ముందు నియ‌మించిన ప‌రిశీల‌కుల్లో ఒక‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌గా, మ‌రొక‌రు హైకోర్టుకు ప‌దోన్న‌తి పొందార‌ని అల‌హాబాద్ హైకోర్టు సుప్రీంకు విన్న‌వించుకుంది. ఈ వివాదానికి సంబంధించిన చివ‌రి విచార‌ణ డిసెంబ‌ర్ 5న జ‌ర‌గ‌నుంది.

supreme-court

2010లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే స‌వాలు చేస్తూ జారీ అయిన పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు విచారించింది. అలాగే హిందీ, సంస్కృతం, ఉర్దూ, ప‌ర్షియ‌న్‌, పాలీ, అర‌బిక్ భాష‌ల్లో ఉన్న అప్పీళ్ల‌ను ప‌ది వారాల్లోగా ఆంగ్లంలోకి త‌ర్జుమా చేసి అందించాల‌ని జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Monday asked the chief justice of the Allahabad high court to appoint two new observers for disputed land in the Babri Masjid-Ram Mandir case within 10 days. The direction was passed by a bench headed by Chief Justice Dipak Misra as the Allahabad high court informed the court that one of the two district judge members serving as observers had retired while the other had been promoted to a higher judicial post. As observers, the judicial officers are required to ensure that transparency is maintained during excavation at the disputed site, for which they visit the site and file regular status reports. For now, they will have to ensure that status quo on the title of the disputed land is not disturbed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి