Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ayodhya : అయోధ్యలో రామాలయ నిర్మాణం పరుగులు ! మసీదుకు అనుమతులే కరువు ?

మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు తర్వాత వెంటనే అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమై వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే పూర్తి కాబోతుండగా.. మసీదుకు ఇప్పటివరకూ అనుమతులే ఇవ్వలేదు.

మూడు దశాబ్దాల నాటి అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో భూ యాజమాన్య హక్కులపై సాగిన సుదీర్ఘ పోరు తర్వాత మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇందులో బాబ్రీ మసీదు కూల్చేసిన స్ధలాన్ని అయోధ్య రామాలయ నిర్మాణానికి ఇవ్వడంతో పాటు అదే పట్టణంలో మరో ప్రాంతాన్ని మసీదు నిర్మాణం చేసుకునేందుకు అనుమతిచ్చింది. అయితే రామాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న ప్రభుత్వం, మసీదు నిర్మాణానికి కనీసం అనుమతులు కూడా ఇవ్వడం లేదని తాజాగా జాతీయ పత్రిక హిందూ తన కథనంలో పేర్కొంది.

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు

రామజన్మభూమి అయిన అయోధ్యలో రామాలయం ఉండాలా, మసీదు ఉండాలా, అసలా స్ధలం ఎవరిదన్న దానిపై సుప్రీంకోర్టు 2019లో కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం గతంలో హిందూ అతివాదులు కూల్చేసిన మసీదు ప్రాంతంలో మందిరం నిర్మించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అలాగే అదే పట్టణంలో మరో చోట మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్ధలం ఇచ్చి, అనుమతులు ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇందులో మొదటిది అమలు కాగా.. రెండో విషయం అమలుకు యూపీలో బీజేపీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది.

అయోధ్య రామాలయం పరుగులు

అయోధ్య రామాలయం పరుగులు

అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం వీహెచ్ పీ ఆధ్వర్యంలో రూ.3500 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇందులో దాదాపు 2 వేల కోట్లు నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు. రామాలయం వద్ద రామాయణ కాలం నాటి అనేక ఇతర దేవతల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే మొదలైన పనులు ఇప్పటికీ రాత్రింబవళ్లూ శరవేగంగా పూర్తవుతున్నాయి. డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరి 2024లో జరిగే మకర సంక్రాంతి పండుగ నాటికి రాముడు విగ్రహం గర్భగుడిలో పూజలను అందుకోనున్నదని 15 మంది సభ్యులతో కూడిన నిర్మాణ ట్రస్ట్ ఛీఫ్ చంపత్ రాయ్ చెప్పారు. 2024 జనవరి 1వ తేదీన రామమందిరం ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు.

మసీదుకు అనుమతులే కరవు ?

మసీదుకు అనుమతులే కరవు ?

మరోవైపు అదే అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం వెంటనే స్ధలం కేటాయించాల్సి ఉండగా.. 2020 ఫిబ్రవరిలో అంటే దాదాపు ఏడాది తర్వాత ఆలయ స్థలం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్‌లోని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం ప్లాట్ కేటాయించింది. వక్ఫ్ బోర్డు మసీదు-ఎ-అయోధ్య అనే పేరుతో మసీదు నిర్మాణాన్ని చేపట్టేందుకు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (IICF) పేరుతో ఒక కమిటీ ఏర్పాటైంది. కానీ భూమి కేటాయింపు తర్వాత ఇప్పటికీ ఏదీ ముందుకు సాగలేదని, కనీసం ఇటుక వేసేందుకు కూడా అనుమతులు ఇవ్వలేదని ద హిందూకు ఐఐఎస్ఎఫ్ కమిటీ సభ్యుడొకరు తాజాగా వెల్లడించారు.

బీజేపీ ఎన్నికల రాజకీయంలో చిక్కి.. !

బీజేపీ ఎన్నికల రాజకీయంలో చిక్కి.. !

రాజకీయంగా ఉత్తర్ ప్రదేశ్ బీజేపీకి చాలా కీలకం. ఇక్కడ బాబ్రీ మసీదు స్ధానంలో రామమందిరం ఉందంటూ తలెత్తిన వివాదాన్ని సొమ్ముచేసుకుని రాజకీయంగా దేశంలో అధికారాన్నే కైవసం చేసుకునే స్ధాయికి ఎదిగిన బీజేపీ.. ఇప్పటికీ మందిర్-మసీద్ వివాదం అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు అర్దమవుతోంది. మందిర నిర్మాణంతో పాటు మసీదు నిర్మాణం కూడా సమాంతరంగా పూర్తయితే తమకు ఎలాంటి రాజకీయ లబ్ది చేకూరదనే అంచనాతో మందిరానికి పూర్తిగా సహకరిస్తూ, మసీదుకు అనుమతులు కూడా ఇవ్వడం లేదనే చర్చ సాగుతోంది. దీనిపై త్వరలో సుప్రీంకోర్టును తిరిగి ఆశ్రయించేందుకు ముస్లిం సంఘాలు సిద్ధమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+