Ayodhya Ram Mandir: అయోధ్యలో ఆ వారం రోజుల్లో ఏం జరగబోతోంది ? షెడ్యూల్ ఇదే..!

అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఈ నెల 22న అతిరథ మహారథుల సమక్షంలో అయోధ్యలోని రాముడి గుడిలో రామ్ లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే వారం రోజుల ముందు నుంచే అంటే జనవరి 16 నుంచే అయోధ్యలో ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ ను అయోధ్య ట్రస్టు తాజాగా విడుదల చేసింది.

అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహావిష్కరణ, ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. జనవరి 16న మొదలయ్యే ఈ మహాఘట్టం.. పలు దశల్లో సాగి చివరిగా జనవరి 22న ప్రాణప్రతిష్టతో ముగియబోతోంది. ఈ మధ్యలో వారం రోజుల పాటు సాగే కార్యక్రమాలు, పూజలు అయోధ్యను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Ayodhya Ram Mandir: list of weeklong rituals planned till consecration ceremony on jan 22

జనవరి 16న నుంచి అయోధ్యలో పెద్ద ఎత్తున వేడుకలు, కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 51 అంగుళాల శ్రీరాముడితో కూడిన రామ్ లల్లా విగ్రహం జనవరి 22 అంతిమంగా ప్రతిష్టించనున్నారు. జనవరి 16, 2024న ప్రాయశ్చిత్త కార్యక్రమం, దశవిధ్ బ్యాట్, జనవరి 17, 2024న 'రామ్ లల్లా' విగ్రహం రాక, 'గణేష్ అంబికా పూజ', 'వరుణ్ పూజ', 'మాతృక పూజ', 'బ్రాహ్మణ వరణం' ఉన్నాయి. అలాగే జనవరి 18న వాస్తు పూజ ఉంటుంది.

జనవరి 19న అగ్ని స్థాపన, 'నవగ్రహ స్థాపన', 'హవనం' జరుగుతాయి. జనవరి 20న 'సరయూ నదీ పవిత్ర జలంతో రామమందిరం యొక్క గర్భగుడిని శుభ్రపరుస్తారు. దీని తర్వాత 'వాస్తు శాంతి', 'అన్నాధివస్' చిత్రాలు వస్తాయి.
జనవరి 21న పవిత్రమైన 'రామ్ లల్లా' దేవతకి 125 కలశంతో దివ్య స్నానం, 'షయాధివాస్' ఆచారం ఇస్తారు. ఆఖరి రోజైన జనవరి 22న 'రామ్ లల్లా' ఆరాధన, ప్రతిష్ఠాపన జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+