Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ayodhya verdict: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మినిట్-టూ- మినిట్ అప్‌డేట్స్, హైలైట్స్

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును చదివి వినిపించింది. కేసులో వాదనలు విన్న న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయోధ్యలో రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంలో వివాదాస్పదమైన స్థలం ఆలయంకు కేటాయిస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ముందుగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కేసు పూర్వాపరాలను చదివి వినిపించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కొన్ని ప్రధాన అంశాలను చదివి వినిపించారు. ఇక శనివారం ఉదయం సుప్రీంకోర్టు హాలులో జరిగిన మినిట్‌-టూ- మినిట్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.

* బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మాణం జరగలేదు. దాని కింద ఉండే మరో కట్టడం ఇస్లామిక్ మూలంకు అనుగుణంగా లేవు

* అంతర్లీనంగా ఉన్న కట్టడానికి ఇస్లాం మూలాలు లేవు. ఆలయం ఉండేదని తెలుస్తోంది దీనికి రుజువులు ఉన్నాయి. అయితే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు చూస్తే ఆలయం కూల్చడం జరిగిందని చెప్పేందుకు ఎలాంటి రుజువులు పొందుపర్చలేదు.

* అయోధ్యలోనే రాముడు జన్మించారని భావిస్తున్న హిందువుల విశ్వాసంను తప్పుపట్టలేము

* చారిత్రాత్మకమైన ఘటనలు, హిందువుల విశ్వాసంను బట్టి అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం అని తెలుస్తోంది. విశ్వాసం అనేది ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత అంశం.

Ayodhya verdict: A Timeline as what had happend in Supreme court

*1992లో మసీదును కూల్చడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్న సుప్రీంకోర్టు

* 1949లో రాముడి విగ్రహం మసీదులో ఉంచడం చట్ట విరుద్ధమన్న సుప్రీంకోర్టు

* బాబ్రీ మసీదును మీర్ బాకీ నిర్మించారు.

* ముస్లింలకు మరోచోట స్థలం కేటాయించాలని సూచించిన సుప్రీంకోర్టు

* అలహాబాదు హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

*నిర్మోహి అఖాడా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

* సున్నీ బోర్డుకు సరైన స్థలంలో 5 ఎకరాలు భూమి కేటాయించాలంటూ సుప్రీం సూచన

* వివాదాస్పద భూమిని ఆలయంకు కేటాయిస్తూ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు

* వివాదాస్పద భూమి రామజన్మభూమి న్యాస్‌కు కేటాయిస్తూ తీర్పు

* ఆలయ నిర్మాణంకు ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీం సూచన

* మూడునెలల్లోగా అయోధ్య చట్టం కింద ట్రస్టును ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు.

Ayodhya verdict: A Timeline as what had happend in Supreme court

* రామమందిరంను ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించాలని సుప్రీం కోర్టు సూచన

* 1993లో కేంద్రం సేకరించిన భూమిని సున్నీ బోర్డుకు కేటాయించొచ్చు

* తీర్పును గౌరవిస్తాం కానీ తీర్పు సంతృప్తికరంగా లేదన్న ముస్లిం పార్టీల తరపున లాయర్ జాఫర్‌య్యాబ్ జిలానీ

* ఆలిండియా పర్సనల్ లా బోర్డు మీడియా సమావేశం

* దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన జాఫర్‌యాబ్ జిలానీ

* త్వరలోనే తీర్పునకు సబంధించిన కాపీలు వస్తాయి

* భవిష్యత్ ప్రణాళికపై ఆలోచిస్తామన్న జిలానీ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+