Ayodhya Verdict:సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పిన మోహన్ భగవత్

న్యూఢిల్లీ: కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో ఉన్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమి ఆలయంకు చెందినదే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. తీర్పును స్వాగతించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్... కాస్త ఆలస్యమైనా మంచి తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చిందన్నారు. అదే సమయంలో ప్రజలు శాంతి సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి గెలుపు మరొకరి ఓటమి కాదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆలయ నిర్మాణంను ఘనంగా ప్రారంభిస్తామని చెప్పారు. అందరం ఐక్యంగా ఉండి ఆలయ నిర్మాణంను పూర్తి చేస్తామని భాగవత్ చెప్పారు.

ఇక కొన్నేళ్లుగా సుప్రీంకోర్టులో నలుగుతున్న అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం కూడా విఫలమైందని గుర్తు చేశారు మోహన్ భగవత్. అయితే వరుసుగా 40 రోజులు సుప్రీంకోర్టు వాదనలు విని తీర్పును చెప్పడాన్ని ఆయన ప్రశంసించారు.

Ayodhya Verdict:RSS Chief Mohan Bhagawat welcomes SC verdict

మసీదు నిర్మాణానికి ముస్లింలకు భూమి కేటాయింపును కూడా స్వాగతించారు మోహన్ భగవత్. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు అన్నీ జరుగుతాయని చెప్పారు. దేశంలో హిందువులు ముస్లింలు ఒకటే అని చెప్పిన మోహన్ భగవత్ ఇద్దరినీ ఎవరూ వేరి చేసి చూడరాదన్నారు. ముందుగా అంతా భారతీయులం అనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు.

ఇక 67 ఎకరాల స్థలంలో మసీదు నిర్మాణానికి ఐదెకరాలు అక్కడే ఏర్పాటు చేయడాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించగా... ఆలయం మసీదు రెండు ఒకే దగ్గర ఉన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఇక అయోధ్య తీర్పుకోసం ఇన్నేళ్లుగా ఎంతో సంయమనంతో ఎదురుచూసిన భారతీయులకు తాను ధన్యవాదాలు చెబుతున్నట్లు భగవత్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+