ayodhya verdict:అశోక్‌ సింఘాల్‌కు భారతరత్న: సుబ్రమణ్య స్వామి డిమాండ్.. ఎందుకంటే!

ఏళ్ల నాటి అయోధ్య భూ వివాదం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వివాదాస్పద భూమి రామ్ న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. దీంతో అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించాలని ఉద్యమించిన నేతలను ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అద్వానీ, అశోక్ సింఘాల్, గోవిందాచార్య ఇతర నేతలు చేపట్టిన పోరాటాన్ని బీజేపీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు.

ఒకడుగు ముందుకేసిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వహిందూ పరిషత్ అగ్రనేత, దివంగత అశోక్ సింఘాల్‌కు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు సింఘాల్ పాటుపడ్డారని తెలిపారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ 1990లో చేపట్టిన రథయాత్రతో రాముని ఆలయం కట్టాలనే డిమాండ్ ప్రారంభమైంది. రథయాత్ర వ్యుహారచనలో ఆరెస్సెస్ సిద్ధాంతకర్త కేఎన్ గోవిందాచార్య ఒకరు. వీరికి సింఘాల్ సహకరించారని పేర్కొన్నారు.

 Ayodhya verdict: Subramanian Swamy wants Bharat Ratna for Ashok Singhal

అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే గోవిందాచార్య స్పందించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అడుగులు పడటదానికి అశోక్ సింఘాల్, అద్వానీ కారణమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చివరికి మూడునెలల్లో రామాలయ నిర్మిస్తామని సంతోషంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో విర్రవీగిపోమని.. సామరస్యంతోనే మెలుగుతామని ఆయన చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో ఇక రామరాజ్యం ఆవిర్భవించబోతుందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కారణం మాత్రం సింఘాలేనని సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+