• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దుర్గామాత మండపంలో అజాన్: ఓంకారంతో పాటు ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలు: కేసు నమోదు

|

కోల్ కత: జై శ్రీరామ్ అనే నినాదం పట్ల భగ్గు మంటోన్న పశ్చిమ బెంగాల్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. తరచూ మతపరమైన సున్నిత అంశాలపై వివాదాస్పద సంఘటనలకు కేంద్రబిందువుగా మారిన ఆ రాష్ట్రం.. మళ్లీ అలాంటి ఉదంతానికి తెర తీసింది. దసరా వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో ఏర్పాటు చేసిన ఓ దుర్గా మాత మండపంలో అజాన్ ను వినిపించారు నిర్వాహకులు. అక్కడితో ఆగలేదు- సర్వమతాలు సమానమేననే అర్థం వచ్చేలా ఓంకారంతో పాటు ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలను ప్రదర్శించారు. ఈ వ్యవహారం కాస్తా దుమారాన్ని రేపుతోంది.

చంద్రబాబు పర్యటనలో జై జగన్ నినాదాలు..బాబు సీరియస్ : వరద బాధితుల రియాక్షన్ తో..!!

ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలతో..

ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలతో..

రాజధాని కోల్ కతలోని బెలియాఘట 33 పల్లీ ప్రాంతంలో ఆదివాసీ బృందం పేరు మీద ఈ దుర్గామాత మంటపం వెలిసింది. దేవీ శరన్నవ రాత్రులు ఆరంభమైనప్పటి నుంచీ ఈ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. మహార్నవమి సందర్భంగా మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలతో. ఓంకారంతో పాటు ఇస్లాంకు గుర్తుగా భావించే అర్ధాకార చంద్రుడు-నక్షత్రం, శిలువలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. అజాన్ ను వినిపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలబోమని భారతీయ జనతాపార్టీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

కేసు నమోదు..

కేసు నమోదు..

దీనిపై బెంగాలీల్లో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. స్థానిక న్యాయవాది శంతను సింఘా దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బెలియాఘట 33 పల్లీ దుర్గామండపానికి చెందిన 10 మంది నిర్వాహకుల పేర్లను ఆయన తన ఫిర్యాదు పత్రంలో పొందుపరిచారు. హైందవ ధర్మాన్ని అణచివేసే కుట్రకు నిర్వాహకులు తెర తీశారని ఆరోపించారు. ఆయనతో పాటు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నాయకులు సైతం ఈ ఉదంతంపై నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై చిత్రీకరించిన వీడియో ఆధారంగా మండపం నిర్వాహకులపై ప్రత్యేకంగా ఇంకో కేసు నమోదు చేశారు. మరి కొందరు ఈ చర్యను సమర్థిస్తున్నారు. అన్ని మతాలు సమానమనే భావన ప్రజల్లో ఏర్పడాల్సిన అవసరం ఉందని, అలాంటప్పుడే మత కల్లోలాలు చెలరేగబోవని చెప్పారు.

అన్ని మతాలు సమానమనే ఉద్దేశాన్ని చాటి చెప్పడానికే..

అన్ని మతాలు సమానమనే ఉద్దేశాన్ని చాటి చెప్పడానికే..

దుర్గా మాత మండప నిర్వాహకులు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. తాము ఏ ఒక్క మతస్తుడి మనోభావాలను కించ పరచట్లేదని, భారత్ వంటి లౌకికవాద దేశంలో సర్వ మతాలు సమానమనే సందేశాన్ని ఇవ్వడానికే తాము ఈ ప్రయత్నం చేశామని వివరణ ఇస్తున్నారు. మేమంతా ఒక్కటే..ఎవరూ ఒంటరివాళ్లు కాదు..` అని చెప్పడానికే తాము సర్వమత సమ్మేళనాన్ని గుర్తు చేయడానికి ఈ ఏర్పాటు చేశామని మండప కమిటీ ఛైర్మన్ అరూప్ సిన్హా తెలిపారు. దీన్ని వేరే దృష్టి కోణంలో చూడొద్దని ఆయన కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని మతాలను సమాన దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని తనయా ముఖర్జీ, ఆయుషీ చక్రబర్తి అభిప్రాయ పడ్డారు.

English summary
A Durga Puja pandal in Kolkata has come under fire for promoting communal harmony by playing the azaan. A complaint has been filed against the Beliaghata 33 Pally Durga Puja pandal committee in Kolkata for playing a recording of azaan (Islamic call to worship) during the ongoing Navratra celebrations. Local lawyer Santanu Singha has named 10 persons for allegedly "disturbing the peace and tranquillity in the West Bengal" and "hit(ting) the sentiments of the Hindu religion".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more