స్నేహితుడి హత్య కేసులో బిటెక్ విద్యార్థికి జీవిత ఖైదు

19 ఏప్రిల్ 2012న షహర్ నగర్‌కు చెందిన జాగ్రత్ మొరదాబాద్‌కు చెందిన తన స్నేహితుడు సంతాను పైన కత్తితో దాడి చేశాడు. కళాశాల వార్షికోత్సవం సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. జాగ్రత్ కత్తితో దాడి చేశాడు.
గాయాలపాలైన సంతానును ఆసుపత్రికి తరలించారు. సంతాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో గురువారం జిల్లా కోర్టు జాగ్రత్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.50వేల జరిమానా విధించింది.
యానాంలో మత్స్యకారుడి గల్లంతు
గౌతమి గోదావరి ఒడ్డున శివంబాత్ వద్ద వీరబాబు అనే ఇరవై మూడేళ్ల మత్స్యకారుడు శుక్రవారం గల్లంతయ్యాడు. తుఫాను కారణంగా గోదావరిలో అలలు ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీరబాబుకి చెందిన పడవ తాడు తెగి కొట్టుకుపోతుండగా దానిని తీసుకు వచ్చేందుకు వీరబాబు ప్రయత్నించి గల్లంతయ్యాడు.












Click it and Unblock the Notifications