షాక్: పిల్లలు పుట్టాలంటే తన ముందే సెక్స్ చేయాలన్న బాబా, అలాగే..

Subscribe to Oneindia Telugu

థానే: వివాహిత మహిళలను, పిల్లలను కలగలేదంటూ వచ్చిన దంపతులను మాయమాటలతో మోసం చేస్తున్న ఓ దొంగ బాబాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రంలోని గోరేగావ్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. థానేకు చెందిన 29ఏళ్ల మహిళ తనకు పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగడం లేదని గోరేగావ్‌లోని యోగేశ్ కుపేకర్ అనే బాబా దగ్గరికి వెళ్లింది. అతనికి తన సమస్యను చెప్పుకుంది. తన సమస్యకు పరిష్కార మార్గం సూచించమని బాబాను ఆశ్రయించగా భర్తతో కలిసి రావాలని సూచించాడు.

అతను చెప్పినట్లుగానే ఆమె తన భర్తతో కలిసి కొద్దిరోజుల తర్వాత బాబా దగ్గరకు వెళ్లింది. అయితే బాబా వారికి ఇచ్చిన సలహాతో దిమ్మతిరిగిపోయింది. పిల్లలు కలగాలంటే తన ముందే శృంగారం చేయాలని ఆదేశించాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ జంట.. బాబా చెప్పినట్లుగానే చేసింది.

Baba arrested for ‘sexually assaulting’ married woman

కాగా, కొద్దిసేపటి తర్వాత పూజ చేయాలంటూ భర్తను బయటికి పంపించాడు. ఆమెను గదిలో వదిలివెళ్లిన భర్తకు కొద్దిసేపటికి అరుపులు వినిపించాయి. తన ప్రైవేట్ భాగాలను తాకి కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడని ఆమె భర్తకు తెలిపింది.

దీంతో వారిద్దరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్ట్ చేశారు. ఇలాంటి దొంగ బాబాలు ఏది చెప్తే అది నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇలాంటి బాబాలు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 42-year-old self-styled baba has been arrested for allegedly sexually assaulting a housewife and cheating several childless couples. The accused, identified as Yogesh Kupekar, used to operate from a place in Goregaon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి