వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిర్ అరణ్య రోదన: బబేసియోసిస్ బారినపడి 23 సింహాల మరణం

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ఆసియా సింహాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సింహాల వరుస మరణాలు ఆందోళనకరంగా మారాయి. గత మూడు నెలల్లోనే 23 సింహాలు మరణించాయి.

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే? కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

ప్రొటోజోవా పారాసైట్ కారణంగా వచ్చే బబేసియోసిస్ వల్లే సింహాలు మృత్యువాతపడుతున్నాయని జునాగఢ్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ తెలిపారు. బ్లడ్ ప్రొటోజోవా పారాసైట్‌ను బబేసియోసిస్ అని పిలుస్తారని, ఇది కొన్ని విష పురుగులు, కీటకాలు కుట్టడం ద్వారా కూడా వస్తుందనిన్నారు.

Pride in danger: Babesiosis outbreak claims lives of 23 lions in Gujarat’s Gir forest.

అయితే ఇది అంటు వ్యాధి కాదని, దీనికి చికిత్స ఉందని సదరు అధికారి తెలిపారు. జాటీయ పార్కులో పెద్ద సింహాలన్నీ చనిపోయాయని, వ్యాధి బారినపడ్డ ఒక జంతువును తినడం వల్లే వీటికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని చెప్పారు.

సింహాల మరణంపై దర్యాప్తు కొనసాగుతోందని, నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. బబేసియా సోకిన మరో 18 సింహాలకు చికిత్స అందజేస్తున్నారు. జసాధర్ జంతు చికిత్స కేంద్రం వీటికి చికిత్స చేస్తోంది.
కాగా, పలు సింహాలు తమలో తాము కలహించుకుని, మునిగిపోయి, వృద్ధాప్యం, పాము కాట్లతో చనిపోయాయని వాసుదేవ తెలిపారు.

కాగా, గిర్ అరణ్యంలో సింహాలు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్, ప్రోటోజోవా పారసైట్ కారణంగా దాదాపు 25 సింహాలు మరణించాయని, ఆ తర్వాత అమెరికా నుంచి కానైన్ డిస్టెంపర్ వైరస్(సీడీవీ) వ్యాక్సిన్‌ను అటవీశాఖ దిగుమతి చేసుకుని, గిర్ అడవిలోని అన్ని సింహాలకు వాటిని వేసినట్లు అధికారులు తెలిపారు.

English summary
Pride in danger: Babesiosis outbreak claims lives of 23 lions in Gujarat’s Gir forest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X