
కట్టప్పకు కరోనా: బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కండీషన్ సీరియస్, ఆస్పత్రిలో చేరిక, త్రిషకూ కోవిడ్
దిగ్గజ నటుడు, బాహుబలి ఫేమ్, ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోయే సహజ నటుడు, కట్టప్పగా అందరి మనసులో స్థానం సంపాదించుకున్న సత్యరాజ్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సత్యరాజ్ కోవిడ్ 19 కోసం పాజిటివ్ పరీక్షించిన తర్వాత నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అమింజిక్కరైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Recommended Video

సినీ పరిశ్రమలో కరోనా కలకలం .. వరుసగా కరోనా బాధితులుగా మారుతున్న సెలబ్రిటీలు
సినిమా పరిశ్రమలో కరోనా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కరోనా బారిన పడటం ప్రముఖంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, విశ్వక్సేన్ మరియు తమన్‌తో సహా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తాము కరోనా మహమ్మారి బారిన పడ్డట్టు వెల్లడించారు.

త్రిషకు కరోనా పాజిటివ్, సత్యరాజ్ పరిస్థితి సీరియస్
స్టార్ హీరోయిన్ త్రిష కూడా తాజాగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అగ్ర సినీ తారలు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన కమెడియన్లు కూడా కరోనా మహమ్మారి బారిన పడిన పరిస్థితి ఉంది. ఇక తాజాగా బాహుబలి సినిమా ద్వారా కట్టప్ప గా అందరి మన్ననలు పొందిన సత్య రాజ్ కరోనా మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని అమింజిక్కరైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేస్తే గాని, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనేది తెలిసే అవకాశం లేదు.

సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా కరోనా పంజా
ఇక తాజాగా కరోనా మహమ్మారి బారిన పడిన త్రిష పరిస్థితి చూస్తే, త్రిష ఆమె పూర్తిగా కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నప్పటికీ ఆమె ప్రభావితమైంది. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ యొక్క మూడవ వేవ్ భారతదేశంలో ప్రబలంగా ఉందని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి . ఈ సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విస్తృతంగా ప్రబలుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా దేశంలో కేసులు ఉప్పెన కొనసాగుతున్న సమయంలో సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి సెలబ్రిటీలను వణికిస్తుంది.