నోట్ల రద్దు తర్వాత మోడీ మరో సంచలన నిర్ణయం: ఇదేనా?

ఇప్పుడిప్పుడు పెద్ద నోట్ల రద్దు నుంచి తేరుకుంటున్న భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ మరో షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి తేరుకుంటున్న భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ మరో షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.2వేల నోటుతోపాటు రూ.10, 5,2, 1 నాణేలను కూడా రద్దు చేస్తారనే వార్తలు కొన్ని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకే రూ.2వేల నోటును రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు రూ.2వేల నోట్లను అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లను కూడా రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక, నాణేలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి ఓ కారణం కూడా ఉంది. నాణేల తయారీకి నోట్ల తయారీ కంటే ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఉదాహరణకు రూ.10 నాణేన్ని తయారు చేయడానికి రూ. 6.10 ఖర్చు కాగా, 10రూపాయల నోటును తయారు చేయడానికి 94పైసలు మాత్రమే ఖర్చు కావడం గమనార్హం.

Ban on coins: Is this the new surprise from Narendra Modi

ఈ లెక్కతో పోల్చుకుంటే రూ.1, 2, 5 నాణేనాల తయారీకి ఎంత ఖర్చువుతోందో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఖర్చు తగ్గించడానికి నాణాలను రద్దు చేసి నోట్లనే ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే నిజమైతే ఇక దేశ వ్యాప్తంగా నాణేలు రద్దు కానున్నాయి.

కరెన్సీ నోట్స్ - ప్రింటింగ్ ఖర్చు
- రూ. 10 - 94 పైసలు
- రూ. 20 - రూ. 1.16
- రూ. 50 - రూ. 1.65
- రూ. 100 - రూ. 1.70
- రూ. 500 - రూ. 2.90
- రూ. 2000 - రూ. 3.80

త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నాణేలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టనుంది. అయితే, దీనిపై ప్రకటన చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందో అర్థం కావడం లేదు.

అయితే, చిన్న నోట్లకు బదులు నాణేలను చెలామణిలో ఉంచాలని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. నోట్ల మనుగడ చాలా తక్కువ కాలం ఉంటుందని, అదే నాణేలు అయితే దీర్ఘ కాలం మనుగడలో ఉంటాయని వారు పేర్కొంటున్నారు. కేంద్రం నోట్లను రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది గానీ, మనుగుడ విషయంలో మాత్రం నాణేలు నోట్ల కంటే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ ఈ నేపథ్యంలోనే కేంద్రం నాణేల రద్దుపై తర్జనాభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+