ఢిల్లీలో బీజేపీకి రివర్స్: తెలుగునేతల ప్రచారం బీజేపీకి ఓట్లు తెచ్చేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడిగా వేడుగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పదునైన వ్యాఖ్యలతో విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారపు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, మాజీకేంద్రమంత్రి కృష్ణం రాజు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
వచ్చామంటే వచ్చామని, ప్రచారం చేశామంటే సరిపోదని, ప్రధాని మోడీ అప్రతిహత విజయాలను కొనసాగించాలంటే ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, ప్రతి తెలుగువారి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ తెలుగు రాష్ట్రాల నేతలకు సూచించారు.

బండారు దత్తాత్రేయ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో తెలుగు వారిని ఒక్కచోటకు రప్పించి బీజేపీకి ఓటేయాలని చెబుతున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.

బండారు దత్తాత్రేయ, కృష్ణం రాజు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో తెలుగు వారు ఉన్న చోట ప్రచారంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ, కృష్ణం రాజు తదితరులు.

బండారు దత్తాత్రేయ, కృష్ణం రాజు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో తెలుగు వారు ఉన్న చోట ప్రచారంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ, కృష్ణం రాజు తదితరులు. మాట్లాడుతున్న దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ, కృష్ణం రాజు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో తెలుగు వారు ఉన్న చోట ప్రచారంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ, కృష్ణం రాజు తదితరులు.

బండారు దత్తాత్రేయ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో తెలుగు వారు ఎక్కువగా ఉన్నచోట బీజేపీ పార్టీ అభ్యర్థితో కలిసి ప్రచారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.

బండారు దత్తాత్రేయ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో తెలుగు వారు ఎక్కువగా ఉన్నచోట బీజేపీ పార్టీ అభ్యర్థితో కలిసి ప్రచారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.
ఢిల్లీలో ప్రచారంపై తెలుగు నేతలతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. అనంతరం కృష్ణం రాజు, కిషన్ రెడ్డిలు మాట్లాడుతూ.. తమ బృందాలు ప్రతి తెలుగువారి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తాయన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారి ఇంటింటికి వెళ్లి వారు ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పైన సర్వేలు వివిధ రకాలుగా చెబుతున్నాయి. బీజేపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు, ఏఏపీయే గెలుస్తుందని ఇంకొన్ని సర్వేలు, ఎవరికీ మెజార్టీ రాదని, హంగా ఏర్పడనుందని మరిన్ని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకే ఎక్కువ సీట్లు అని, కాదు.. కాదు ఏఏపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని ఇంకొన్ని సర్వేలు చెబుతున్నాయి.
తొలుత బీజేపీ వైపే అన్ని సర్వేలు మొగ్గు చూపాయి. అయితే, కిరణ్ బేడీ చేరిక తర్వాత కొంత తగ్గినట్లుగా కనిపిస్తోంది. బేడీ రాకతో తమకు లాభిస్తుందనుకుంటే అదే మైనస్ అయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీ కంటే ఏఏపీయే తాజాగా ముందంజలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు నేతల ప్రచారం.. ఢిల్లీలోని తెలుగు వారి ఓట్లను బీజేపీ వైపుకు ఏ మేరకు రప్పిస్తాయో చూడాలి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications