బెంగళూర్ ఎటిఎం దాడి: అనుమానితుడి పరారీ?

బళ్లారి రోడ్డులోని ఎటిఎం కేంద్రం వద్ద నిందితుడిని పోలిన వ్యక్తి తచ్చాడుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులకు అతను కనిపించలేదు. పోలీసుల కళ్లు గప్పి అతను పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
బెంగళూర్‌లోని ఎటిఎం కేంద్రంలో బ్యాంక్ అధికారి జ్యోతి ఉదయ్‌పై దుండగుడు దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొంది ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయింది. అయితే, నిందితుడు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.
కర్ణాటక పోలీసులు ఆంధ్రప్రదేశ్, కేరళ పోలీసుల సహాయంతో అతని కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో అతను కనిపించాడంటూ ఇది వరకు వార్తలు వచ్చాయి. కర్ణాటకలోని తుముకూర్ జిల్లాలో నిందితుడిని పోలిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఒకటి రెండు సార్లు ప్రచారం జరిగింది. కానీ, ఎటిఎం దాడి కేసు నిందితుడు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.












Click it and Unblock the Notifications