వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే కొడుకు గూండాగిరి, పబ్ లో దాడి, ఆసుపత్రిలో హత్యాయత్నం, సీఎం వార్నింగ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని శాంతినగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ నలపాడ్, అతని స్నేహితులు ఓ పారిశ్రామికవేత్త కుమారుడి మీద పబ్ లో దాడి చేసి మళ్లీ ఆసుపత్రికి వెళ్లి హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చెయ్యకుండా నిర్లక్షం చేసిన ఏసీపీ, ఇన్స్ పెక్టర్ ను బెంగళూరు నగర పోలీసు కమీషనర్ సునీల్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు.

యూబీ సిటీ పబ్

యూబీ సిటీ పబ్

శనివారం రాత్రి 11 గంటల సమయంలో శాంతినగర ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని 10 మంది స్నేహితులు యూబీసీటీలోని ఫర్జ్ కేఫ్ పబ్ కు వెళ్లారు. ఆ సమయంలో డాలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త లోక్ నాథ్ కుమారుడు విద్వత్ (24), అతని సోదరుడు సాత్విక్ అదే పబ్ లో ఉన్నారు.

ఎమ్మెల్యే కొడుకు గూండాగిరి

ఎమ్మెల్యే కొడుకు గూండాగిరి

పబ్ లో విద్వత్ కాలుచాపుకుని కుర్చొని ఉన్న సమయంలో మోహమ్మద్, అతని స్నేహితులు కాలు వెనక్కి పెట్టుకోవాలని గట్టిగా దభాయించారు. ఆ సందర్బంలో మోహమ్మద్, విద్వత్ మధ్యమాటామాటా పెరిగింది. ఆసమయంలో సహనం కొల్పోయిన మోహమ్మద్ అతని అనుచరులు విద్వత్ ను చితకబాదేశారు, అడ్డువచ్చిన విద్వత్ సోదరుడు సాత్విక్ ను చితకబాదేశారు.

ఆసుపత్రికి వెళ్లి దాడి

ఆసుపత్రికి వెళ్లి దాడి

తీవ్రగాయాలైన విద్వత్ సమీపంలోని మల్యా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుంటున్నాడు. అర్దరాత్రి మల్యా ఆసుపత్రికి వెళ్లిన మోహమ్మద్, అతని స్నేహితులు మళ్లీ చికిత్స పొందుతున్న విద్వత్ మీద దాడి చేశారు. ముఖం పగిలి ఎక్కువ రక్తంపోవడంతో విద్వత్ సృహతప్పడంతో వెంటనే అతన్ని ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసు పెడితే లేపేస్తాం

కేసు పెడితే లేపేస్తాం

బెంగళూరు నగర యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన మోహమ్మద్, అతని అనుచరులు పోలీసు కేసు పెడితే నిన్నులేపేస్తాం అని విద్వత్ ను హెచ్చరించి మాల్యా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న విద్వత్ తండ్రి, వ్యాపారవేత్త లోక్ నాథ్ ఆసుపత్రి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హోం మంత్రి ఎంట్రీ

హోం మంత్రి ఎంట్రీ

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ వ్యవహారం కర్ణాటక సీఎం సిద్దరామయ్య వరకు వెళ్లింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు మోహమ్మద్, అతని అనుచరులును అరెస్టు చెయ్యాలని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పోలీసులపై వేటు

పోలీసులపై వేటు

మోహమ్మద్ ను అరెస్టు చెయ్యకుండా నిర్లక్షం చేసిన ఏసీపీ మంజునాథ్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ విజయ్ ను సస్పెండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు మోహమ్మద్ ను బహిష్కరించాలని కేపీసీసీ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావు ఆదేశాలు జారీ చేశారు.

 సీఎం వార్నింగ్

సీఎం వార్నింగ్


సొంత పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ వ్యవహారంపై సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. నేరం చేసింది ఏ పార్టీ వారైనా తాము విడిచిపెట్టమని, మోహమ్మద్ ను వెంటనే అరెస్టు చెయ్యాలని సోమవారం సీఎం సిద్దరామయ్య పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు బెంగళూరు సీసీబీ పోలీసులకు బదిలీ కావడంతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఐదు మందిని అరెస్టు చేసి మోహమ్మద్ కోసం గాలిస్తున్నారు.

English summary
Bengaluru City Police Commissioner Sunil Kumar has ordered the suspension of Vijay Hadagali, inspector of Cubbon Park police station, in connection with the assault on 24-year-old Vidwath by Mohammed Haris Nalapad, son of MLA N A Haris. Further, the case has been transferred to the Central Crime Branch (CCB) for further investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X