తాజ్ మహల్: సందర్శనకు వస్తున్న రెండో ఆధ్యక్షుడిగా ఒబామా

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత్ పర్యటనలో కొత్త కొత్త ప్రధాన్యతలు సంతరించుకుంటున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్ తర్వాత తాజ్ మహల్‌ను సందర్శిస్తున్న మరో అధ్యక్షుడు ఈయనే కావడం విశేషం.

దీంతో ఆగ్రాని ఇప్పటికే అమెరికా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మొత్తం 100 మంది అమెరికా దళాలు, 4000 మంది భారత భద్రతా దళాలు ఆగ్రా విధుల్లో పాల్గొంటున్నాయి. రహదారులపై బుల్లెట్ ప్రూఫ్ కార్లు, యమునా నదిలో మోటారు బోట్లతో భద్రతా దళాలు గస్తీ విధులు నిర్వహిస్తున్నాయి. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తున్న ఒబామాకు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

 Barack Obama is the second person to visit taj mahal

ఒబామా భారత పర్యటన షెడ్యూల్:

ఆయన జనవరి 25న ఉదయం 4.45 గంటలకు ఢిల్లీ రానున్నారు. 10:10 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకొని.. అక్కడి నుంచి 10:40కి రాజ్‌ఘాట్ వెళ్తారు. 11:20కి హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:50 గంటలకు ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతారు.

అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఇచ్చే విందులో ఒబామా పాల్గొంటారు. జనవరి 26న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:40 నుంచి 3:10 వరకు సిఈవోల సదస్సుకు హాజరవుతారు. 6:50 నుంచి 7:20 వరకు ప్రసంగిస్తారు. ఆరోజు రాత్రి ప్రధాని ఇచ్చే విందులో పాల్గొంటారు. 27న ఉదయం 10:40కి సిరిఫోర్ట్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 3:05 నుంచి 4:05 మధ్య తాజ్‌మహల్ సందర్శించి సాయంత్రం 5:50 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+