బార్లాకు బార్లా: 9వ తేదీ నుంచి రీ ఓపెన్.. 50 శాతం సీట్లతో తెరిచేందుకు అనుమతి..

కరోనా వైరస్ వల్ల విధించిన ఆంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించుకుంటున్నాయి. అన్ లాక్ 4.0లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి బార్లను రీ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ట్రయల్ బేసిస్ కింద 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బార్లను ఓపెన్ చేస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లలో మద్యం సరఫరాకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

అన్ లాక్ 4.0లో భాగంగా బార్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కూడా నిర్ణయం తీసుకొని.. ముందడుగు వేసింది. కంటోన్మైంట్ జోన్లు కానీ ప్రాంతాల్లో బార్లు/ పబ్‌లు ఓపెన్ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొన్నది. అయితే ఆయాచోట్ల కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని మాత్రం స్పష్టంచేసింది. మాస్క్ తప్పనిసరి అని తేల్చిచెప్పింది. బార్, పబ్బులలో 50 శాతం సీట్ల వరకే అనుమతిస్తారు. ఆయా చోట్ల భౌతిక దూరం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. చేతులను తరచూ శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు తప్పనిసరి చేశారు.

Bars to reopen in Delhi from September 9, operate at 50% capacity..

Recommended Video

    Final-Year Exams To Be Held, Can't Promote Students Without It - Supreme Court || Oneindia Telugu

    ఒకవేళ కోవిడ్-19 మార్గదర్శకాలను బార్లు, పబ్బులు ఉల్లంఘిస్తే వెంటనే వాటిని మూసివేస్తామని ఆప్ సర్కార్ స్పష్టంచేశారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల నమోదులో రెండో స్ధానంలో ఉండగా.. బార్లు, పబ్బులు ఓపెన్ చేయడం ఏంటీ అని కొందరు విమర్శిస్తున్నారు. కానీ కేజ్రీవాల్ సర్కార్ మాత్రం పబ్బులు, బార్లలో పరిమిత సంఖ్యలో జనం అనుమతి కోసం అనుమతిచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+