మోడీ నాయకత్వం దేశానికి దిశానిర్దేశం: కిరణ్ బేడీ, థరూర్ ప్రశంసలు

న్యూ ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో దేశం అభివృద్ధిపథంలో పయనిస్తోందని తాజాగా ఆ పార్టీ చేరిన నాయకురాలు కిరణ్‌ బేడీ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి నూతన దిశానిర్దేం చేస్తోందన్నారు.

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే పార్టీ ఎన్నికలకు వెలుతోందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ బిజెపికి నాయకత్వం వహిస్తారా అన్న మీడియా ప్రశ్నకు కిరణ్‌ బేడీ స్పందిస్తూ.. తాను పార్టీ కార్యకర్తనని, నాయకత్వం అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధినాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తాను సిద్ధమేనన్నారు.

Bashing Modi to praising Modi: Kiran Bedi's flip-flops on Twitter

మోడీపై థరూర్ ప్రశంసలు

కోల్‌కతా: కాంగ్రెస్‌ పార్లమెంటుసభ్యుడు శశిధరూర్‌ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ప్రశంసలు గుప్పించారు. ప్రధాని మోడీ మంచి నేత అని శశిధరూర్‌ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధరూర్‌ ప్రధాని మోడీని ఆకాశానికెత్తేశారు.

ఎంపీగా తాను గెలిచినప్పుడు మోడీ శుభకాంక్షలు తెలిపారని, ఆయన వైఖరితో తాను ముగ్ధున్నయ్యానని శశిథరూర్‌ తెలిపారు. బిజెపిలో నిరసన ధ్వనులను అదుపు చేసే సామర్ధ్యం మోడీకి ఉందన్నారు.

ఇది ఇలా ఉండగా శశిథరూర్‌ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనియాంశమయ్యాయి. భార్య సునంద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న థరూర్‌ ఉన్నపలంగా ప్రధాని మోడీని పొగడటంతో అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. మరోవైపు ధరూర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. థరూర్‌ అసందర్భ ప్రసంగానికి పాల్పడుతున్నారంటూ మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+