• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూపీ దంగల్: ప్రచారానికి యోధానుయోధులు దూరం

By Swetha Basvababu
|

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయాల్లో కాకలు తీరిన నాయకులు దూరంగా ఉన్నారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), దాని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీల్లో నాయకత్వ మార్పు కూడా దానికి ఒక కారణం. తొలిదశ పోలింగ్ ప్రక్రియ ముగిసిపోగా, సోమవారం మలిదశ పోలింగ్ జరిగే అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారానికి తెర పడనున్నది.

ఇటు రాష్ట్రంలోని అధికార సమాజ్ వాదీ పార్టీ మొదలు దాని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీలోనూ ఈ పరిస్థితి నెలకొన్నది. అదికార ఎస్పీలో ఆధిపత్య పోరులో గత నెల ఒకటో తేదీన జరిగిన పార్టీ జాతీయ సదస్సులో అధ్యక్షుడిగా యూపీ సీఎం అఖిలేశ్ ఎన్నికవ్వడంతో పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మన:స్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర మంత్రి ఆజంఖాన్ వంటి సీనియర్ నేతలు అభ్యర్థించినా తన వైఖరి మార్చుకోలేదు.

తొలి రెండు దశల ప్రచారానికి ప్రచారానికి దూరంగా ఉన్నారు. అఖిలేశ్ సారథ్యంలో జరిగిన సదస్సు పార్టీ నుంచి బహిష్కరించడంతో ఎస్పీ రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, ఆయన సన్నిహితురాలు జయప్రద కూడా ఎన్నికలకు, రాజకీయ కార్యకలాపాలకు దూరంగానే మసులుతున్నారు. ఇక అనారోగ్యంతో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు.

ఫలితంగా అధికార ఎస్పీ - కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రచార బాధ్యతలను యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వీకరించారు. మరోవైపు ఇరు పార్టీల నేతలు డింపుల్ యాదవ్, జయా బచ్చన్ , యూపీ మంత్రులు ఎస్పీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, షీలా దీక్షిత్, రాజ్ బబ్బర్ తదితరులు క్రియాశీల పాత్ర పోషిస్తున్న

 శివ్ పాల్ తీరిది..

శివ్ పాల్ తీరిది..

యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివ్‌పాల్ కూడా ఎతావాలో తాను పోటీచేస్తున్న జస్వంత్ నగర్ సెగ్మెంట్‌కే పరిమితం అయ్యారు. పార్టీ నాయకత్వం అఖిలేశ్ చేతుల్లోకి వెళ్లడంతో శివ్ పాల్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. అఖిలేశ్ పార్టీ టిక్కెట్ కేటాయించినా.. వచ్చేనెల 11 తర్వాత కొత్త పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. దీనికి తోడు పార్టీ తరఫున ప్రచారకర్తల జాబితాలో ఎస్పీ.. ఆయన పేరు చేర్చలేదు. దీంతో ఆయన పోటీచేస్తున్న నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడంతో పలువురు ఎస్పీ అభ్యర్థులు ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అఖిలేశ్‌పై బేణీ అలక

అఖిలేశ్‌పై బేణీ అలక

బారాబంకీ జిల్లాలోని రాం నగర్ స్థానాన్ని తన కొడుకు రాకేశ్ వర్మకు టిక్కెట్ ఇవ్వనందుకు ఎస్పీ సీనియర్ నేత బేణి ప్రసాద్ వర్మ అలక బూనారు. దీంతో ఆయన బారాబంకీకే పరిమితం అయ్యారు. ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి సుముఖత చూపడం లేదు.

అద్వానీ కనుమరుగేనా?

అద్వానీ కనుమరుగేనా?

ఇంతకుముందు జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఒక్క సభలోనూ కనిపించలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకత్వం కూడా ఆయన సేవలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అందువల్ల యూపీ ప్రచారకర్తల జాబితాలో ఆయన పేరు లేకుండా జాగ్రత్త పడింది.

ఇలా షాట్ గన్..

ఇలా షాట్ గన్..

గత ఎన్నికల్లో ప్రచారంచేసిన బాలీవుడ్ సినీనటుడు, బీహార్ లోని పాట్నా సాహిబ్ ఎంపీ శత్రఘ్న సిన్హా ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పట్ల వ్యతిరేకత చూపుతున్న శత్రఘ్న సిన్హా సమయం చిక్కినప్పుడల్లా ఆయనపైనా, కేంద్రం మీదా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే..

 కల్యాణ్, కేసరీ ఇలా..

కల్యాణ్, కేసరీ ఇలా..

యూపీ బీజేపీలో సీనియర్ నేత కల్యాణ్ సింగ్ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న అత్రౌలి నుంచి ఆయన మనుమడు సందీప్ సింగ్ పోటీలో ఉన్నారు కూడా. కానీ ఆయన రాజస్థాన్ గవర్నర్ కావడంతో ప్రచారంలోకి దిగలేదు. యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కూడా ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
LUCKNOW: Uttar Pradesh Assembly polls this time witnessed a generation shift with many bigwigs including SP patron Mulayam Singh Yadav and Congress boss Sonia Gandhi missing the campaign trail in the first two phases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more