అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ 5కు టిఫిన్, భోజనం రూ 10, మనదేశంలోనే, ఎక్కడంటే ?
బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాబ్, బీఎంటీసీ డ్రైవర్లు, కండెక్టర్లు, గ్రౌండ్ సిబ్బందికి తక్కువ ధరలకు ఆహారం అందించేందుకు టెర్మినల్-1 పార్కింగ్ స్థలంలో ఇందిరా క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం, బీబీఎంపీ నిర్ణయించింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటిన్ ఎప్పుడు ప్రారంభిస్తారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ (ఆరోగ్యం) వికాస్ కుషోర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం కేఐఏ నిర్వాహకులతో పాటు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంట గదితో పాటు క్యాంటీన్ నిర్మాణ పనులు కొద్దిరోజుల క్రితం ప్రారంభించగా మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్నాయి. కొత్త ఇందిరా క్యాంటీన్ ఫిబ్రవరి మధ్య నాటికి ఆహారాన్ని అందించడానికి సిద్ధం అవుతోంది.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రంయంలో ప్రారంభం అయ్యే ఇందిరా క్యాంటిన్ లో రూ. 5కే టిఫిన్, రూ.10కే మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అందజేస్తారు. బీబీఎంపీ చీఫ్ హెల్త్ ఆఫీసర్ సయ్యద్ సిరాజుద్దీన్ మదీనీ మొదట కేఐఏలో ఇందిరా క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. అవసరమైతే మరొకటి ఇందిరా క్యాంటిన్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కేఐఏలో రెండు ఇందిరా క్యాంటిన్లతో సహా బెంగళూరు నగరమంతటా ఇందిరా క్యాంటీన్‌లను నడపడానికి అధికారులు టెండర్లు పిలిచారు.
టెక్నికల్ విభాగం అధికారులు ఈ విషయంలో ముమ్మరంగా పనులు చేస్తున్నారు. నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. అప్పటి వరకు ఎయిర్‌పోర్టులో క్యాంటీన్ నిర్వహించాలని ప్రస్తుత కాంట్రాక్టర్‌ను బీబీఎంపీ కోరింది. ట్యాక్సీ డ్రైవర్ల డిమాండ్ మేరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు ఇందిరా క్యాంటీన్లను నిర్మించాలని సిద్దరామయ్య ప్రభుత్వం ఇప్పటికే బీబీఎంపీని ఆదేశించింది.

ప్రస్తుతం ప్రీకాస్ట్ మోడల్‌లో క్యాంటీన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.1.30 కోట్లతో ఇందిరా క్యాంటీన్‌తో పాటు వంటగదిని ప్రీకాస్ట్ మోడల్‌లో నిర్మిస్తున్నారు. ఈ క్యాంటీన్‌కు వచ్చిన స్పందన ఆధారంగా మరో క్యాంటీన్‌ను నిర్మించాలని బీబీఎంపీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ ఏరియాలోని 7వ ప్లాట్‌ఫారమ్‌లో క్యాంటీన్, కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు బీబీఎంపీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications