'ఫడ్నవీస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు.. ఎన్నికలకు సిద్ధం'
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్ధితులు చూస్తుంటే మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని, అందురు పార్టీ కార్యకర్తలు సిధ్దంగా ఉండాలని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రలో రాయగడ్ జిల్లాలోని అలీబేగ్‌లో రెండు రోజులపాటు పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. తొలిరోజు ఈ శిక్షణ శిభిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోతే అందుకు ఎన్‌సీపీ కారణం కాదన్నారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 121, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్‌సీపీ 41, ఎంఐఎం 2 స్థానాలను గెలుపొందిందగా.. అత్యధిక స్ధానాలను గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా ఎన్‌సీపీ బయట నుంచి తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ రెండు స్ధానాలను కైవసం చేసుకోవడం పట్ల శరద్ పవార్ స్పందించారు. గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వం మూజువాణి ఓటుతో బలపరీక్షలో నెగ్గింది.

దీంతో అక్రమ పద్ధతిలో బలపరీక్షలో ఫడ్నవీస్ ప్రభుత్వం నెగ్గిందని ఆరోపిస్తూ శివసేన, కాంగ్రెస్ పార్టీలు గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి ఫిర్యాదు చేశాయి. అదేవిధంగా ఎన్‌సీపీ శాసనసభ వ్యవహారాల నాయకుడు అజిత్ పవార్ కూడా బలపరీక్ష జరిగిన విధానాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
దీంతో మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తిగా పదవిలో కొనసాగుతదన్న గ్యారంటీ లేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన కార్యకర్తులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక మహారాష్ట్రలో తిరిగి భారతీయ జనతా పార్టీతో కలిస్ ఆలోచన లేదని, భవిష్యత్తులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ.. బీజేపీకి మద్దతు ఉపసంహరించినా తమ పార్టీ మద్దతివ్వదని తేల్చి చెప్పింది. అసెంబ్లీ విశ్వాస పరీక్ష సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందని సోమవారం నాటి సామ్నా పత్రిక సంపాదకీయంలో విమర్శించింది.
గతంలో బీజేపీతో తాము మంచి సంబంధాలను నడిపినా ఇప్పుడు వాటిని పునరాలోచించుకోవడం లేదని ప్రకటించింది. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్, ఎన్‌సీపీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని... ఇప్పుడు ఎన్‌సీపీ, బీజేపీలు కలిసి ఆ పని చేస్తున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications