బీచ్ లవర్స్.!సముద్రపు ఒడ్డున చేపల రూపంలో తేళ్లు సంచరిస్తున్నాయట.!బ్రో.. జరభద్రం .!
చెన్నై/హైదరాబాద్ : సూర్యస్నానాలాచరించే అలవాటు ఉన్న వాళ్లే కాకుండా సరదాగా సేదతీరేందుకు సముద్ర తీరాలకు వెళ్లేవాళ్లు ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇంతకు ముందు లాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బీచ్ లో గెంతులు వేద్దామనుకుంటే మాత్రం కుదరదనే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంతకు ఎంతో స్వేఛ్చగా సముద్ర తీరంలో గంటలు గంటలు విహరించిన జంటలు ఇక మీదట అంత స్వతంత్రంగా బీచ్ లలో తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అరుదైన సముద్ర జలచరాలు.. వెలుగులోకి వచ్చిన విషపూరిత తేలు చేపలు
సముద్ర తీరంలో ఎగిసి పడుతున్న కెరటాలు, చల్లని గాలులు, పాదం కింద మెత్తటి ఇసుక, అప్పుడప్పుడు కాళ్లను తడిపి వెళ్లే అలలు.. మొత్తంగా బీచ్ లో ఉండే కిక్కే వేరబ్బా అనే సందర్బాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు ఆ పరిణామాలన్ని మారిపోబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీచ్ లలో చేపల రూపంలో ఉన్న విషపూరిత తేళ్లు బీచ్ లవర్స్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, బౌగోళిక కారణాలు, ప్రకృతిలో వస్తున్న మార్పుల వల్ల ఇలాంటి ప్రాణులు సుదూర ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది.

చెన్నై రామనాథపురం జిల్లాలో అరుదైరన ఘటన..సేతుకరై సముద్రతీరంలో తేలు చేప..
తమిళనాడులోని రామనాథపురం జిల్లా సేతుకరై సముద్రతీరంలో అరుదైన విషపూరిత తేలు చేపలు బీచ్ లో కనిపించినట్టు నిర్దారణ అవుతోంది.దీంతో కొత్త కొత్త భయాలు వెలుగు చూస్తున్నాయి. మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో ఈ అరుదైన సముద్ర జలచరాలు జీవిస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలో వేరెక్కడా లేని విధంగా చేపలు, సముద్రపు జంతువులతో సహా నాలుగువేలకు పైగా అరుదైన జలచరాలు జీవిస్తున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా ప్రకటించి పర్యవేక్షణ జరుపుతున్నారు వాతావరణ నిపుణులు.

బీచ్ ప్రేమికులకు చేదు వార్త..సముద్ర తీరంలో విహరించడం మంచిది కాదంటున్న శాస్త్రవేత్తలు..
తాజాగా కేంద్ర మత్స్యశాఖ పరిశోధన సీనియర్ సైంటిస్టు జయభాస్కరన్ ఆధ్వర్యంలో పరిశోధక బృందం మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో విచిత్ర అంశాలు వెలుగు చూసాయి. తిరుపుల్లాని సమీపంలోని సేతుకరై సముద్ర ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితిలో తేలు చేపలు కనిపించాయి. వీటిని పరిశోధనల నిమిత్తం వెలికి తీశారు. ఇవి తరచుగా రంగులు మార్చే చేపలుగా జయభాస్కరన్ పేర్కొన్నారు. ఇవి మనిషిని కుట్టిన, ఈ చేపలను ఆరగించిన శరీరంలోకి విషం వ్యాపించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నట్లు తెలిపారు. అసలు ఈ చేపల జీవన స్థితిపై పూర్తి స్థాయి పరిశోధనలు చేస్తున్నట్లు సీనియర్ సైంటిస్టు జయభాస్కరన్ తెలిపారు.

బీచ్ కనిపించే తేలు చేపలు.. ఎంతో విషపూరితమంటున్న సైంటిస్టులు..
ఇదిలా ఉండగా బీచ్ లలో ఎక్కువసేపు సేద తీరే వారు, ముఖ్యంగా రాత్రి పూట బీచ్ లలో సంచరించడాన్ని ఇష్టపడే వారు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్ర తీరంలో కనిపించే చేపలే కదా అని ముట్టుకున్నా, వండుకుని తిన్నా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సముద్ర గర్బ శాస్త్రవేత్తలు నిర్దారిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త జీవరాసులు కూడా భూమి మీదకు వస్తున్నయని, జలచారాల రూపంలో ఇవి ముందుగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications