రాష్ట్రంలో 'బీచ్ వెడ్డింగ్' జోరు.. తక్కువ ధరకే సముద్ర తీరాన వివాహం..
పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒకేసారి జరుపుకునే కార్యక్రమం. అందుకే యువతీయువకులు ఈ మూడు ముళ్ల బంధాన్ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం ఎంతయినా ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. పెళ్లి అనేది తమ లైఫ్ లో మెమొరబుల్ గా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విధానం యువతలో వేగంగా పెరిగిపోతుంది.
ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ లు కూడా అధికం అవుతున్నాయి. ఇంటి దగ్గర లేదా కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు పాతకాలం పద్ధతులుగా మారాయి. ఇప్పుడు సెలబ్రిటీల నుంచి మామూలు యువత దాకా అంతా డెస్టినేషన్ వెడ్డింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది గమనించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్ వెడ్డింగ్ అనే కొత్త కార్యక్రామాన్ని ప్రారంభించింది. యువతీయువకులకు తక్కువ ధరకే ఈ కార్యక్రమాన్ని అందించడమే కాకుండా రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ అడుగులు వేసింది తమిళనాడు ప్రభుత్వం.
తమిళనాడులోని సముద్రం ఒడ్డున ఈ బీచ్ వెడ్డింగ్ కార్యక్రమాన్ని తక్కువ ధరకే అందిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ బీచ్ వెడ్డింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా ఈ బీచ్ వెడ్డింగ్ ను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
బీచ్ వెడ్డింగ్ పథకంలో భాగంగా ప్రైవేట్ రిసార్టులతో పోల్చితే తక్కువ ధరకే ఈ బీచ్ వాతావరణంలో బీచ్ వెడ్డింగ్ సౌకర్యాన్ని యువతీయువకులకు అందించడం.. ఈ పథకం తొలుత మామల్లాపురంలోని తమిళనాడు బీచ్ రిసోర్ట్ హోటల్ లో ప్రారంభం అయింది. ఇక వెన్యూ అండ్ బుకింగ్ ఫీజు విషయానికి వస్తే రూ. 10, 000 ఉంది. అలాగే వెజిటేరియన్ మీల్స్ ఒక్కో వ్యక్తికి రూ. 1,100 స్టార్టింగ్ ఉంది. అలాగే రూమ్స్ కూడా అందుబాటులో ఉంచుతోంది. 22 గంటలపాటు స్టే చేసేందుకు రూ. 5వేలు చెల్లిస్తే సరి.

ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం బీచ్ ప్రాంతాన్ని, కేటరింగ్ ను ఏర్పాటు చేస్తుంది. అయితే కుటుంబ సభ్యులే స్టేజీ సెటప్, డెకరేషన్స్, లైటింగ్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని అనేక బీచ్ లను బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా మార్పులు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని కోవలం, మరీనా, అలాగే నాగపట్టినమ్, రామనాథపురం బీచ్ లను అభివృద్ధి చేస్తోంది.
ఇక ఇప్పటికే రాష్ట్రంలోని అర్హులైన నవ వధూవరులకు తమిళనాడు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఈ మేరకు మూవలూర్ రామమిర్తమ్ అమ్మైయార్ మ్యారేజ్ అసిస్టెంట్స్ స్కీమ్ లో భాగంగా రూ. 50 వేలు అందిస్తోంది. అలాగే మంగళసూత్రం కోసం 8 గ్రాముల బంగారం కూడా అందిస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications