ఆర్యన్ ఖాన్ ను కేంద్ర సంస్థలు టార్గెట్ చేసింది అందుకే; బీజేపీపై మెహబూబా ముఫ్తీ షాకింగ్ కామెంట్స్
పీడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంపై కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేశారు. బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ముంబై క్రూయిజ్ డ్రగ్స్ వివాదంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై స్పందించిన ఆమె ఆర్యన్ ఖాన్ ను తన ఇంటిపేరు కారణంగానే కేంద్ర ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో లఖింపూర్ ఖేరి ఘటనపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారని కేంద్ర మంత్రి కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు

రైతుల మరణాలకు బాద్యుడిని అరెస్ట్ చెయ్యరు, 23 ఏళ్ళ ఆర్యన్ ను అరెస్ట్ చేస్తారు: మెహబూబా ముఫ్తీ
యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులను హతమార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పై చర్యలు తీసుకోకుండా ఆర్యన్ ఖాన్ ను టార్గెట్ చేస్తున్నారంటూ మెహబూబా ముఫ్తీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నలుగురు రైతులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేయడానికి బదులుగా కేంద్ర సంస్థలు 23 సంవత్సరాల వయసున్న ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

బీజేపీ సర్కార్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుందన్న మెహబూబా ముఫ్తీ
ఆర్యన్ ఖాన్ అరెస్టు అతని ఇంటిపేరు ఖాన్ కావడం వలననే అని మెహబూబా ముఫ్తీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బిజెపి తన హిందూ ఓటు బ్యాంక్ యొక్క వికృతమైన కోరిక తీర్చడం కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఇది న్యాయానికి జరుగుతున్న అవమానమని మెహబూబా ముఫ్తీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్రూయిజ్ డ్రగ్ రైడ్‌లో ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసినప్పటి నుండి, షారూఖ్ మరియు అతని కుటుంబానికి అన్ని వైపుల నుండి మద్దతు వెల్లువెత్తుతోంది.

షారూక్ ఖాన్ కుటుంబానికి బాలీవుడ్ మద్దతు, ఆర్యన్ ఖాన్ బెయిల్ తిరస్కరణ
అతని స్నేహితులు సల్మాన్ ఖాన్, సంజయ్ కపూర్, కరణ్ జోహార్ మరియు ఇతరులు షారుక్ ఖాన్ నివాసానికి వెళ్ళి, షారుక్ ఖాన్ ను కలిసి ధైర్యం చెప్తున్నారు . ఇతర బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను , ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. అప్పటినుండి ఇప్పటివరకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పదేపదే ఆర్యన్ బెయిల్ పిటిషన్ కోర్టులో తిరస్కరించబడుతుంది.
Recommended Video

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై బీజేపీపై ప్రతిపక్షాల ధ్వజం
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నారు. అక్టోబర్ 13 న తదుపరి బెయిల్ విచారణ జరగనుంది. ఈ క్రమంలో లఖింపూర్ కేరి ఘటనలో నలుగురు రైతుల మరణాలకు కారణమై, హింసాకాండకు బాధ్యులైన వారిని అరెస్టు చేయకుండా,23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ కు అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ ఉందని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా బీజేపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications