వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వం రాజకీయ సన్యాసం ! బుజ్జగించే పనిలో శశికళ అండ్ కో

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మనస్తాపంతో అజ్ఞాతంలో ఉన్న పన్నీర్ సెల్వంను బుజ్జగించే పనిలో పడ్డారు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ. సీఎం పదవిని కోల్పోయిన పన్నీర్ సెల్వం తీవ్రమనస్థాపంతో తన సన్నిహితులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఏమి చెయ్యాలి ? అని చర్చిస్తున్నారు.

సన్నిహితులతో తన బాధను పంచుకుంటున్న పన్నీర్ సెల్వం శశికళ సీఎం అయిన తరువాత తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకోనని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న శశికళ, మన్నార్ గుడి గ్యాంగ్, ఆమె శిభిరంలోని నాయకులు హడలిపోతున్నారు.

<strong>శశికళకు పదవికి సుప్రీం తీర్పు గండం ? అదే జరిగితే జైలులో !</strong>శశికళకు పదవికి సుప్రీం తీర్పు గండం ? అదే జరిగితే జైలులో !

పన్నీర్ సెల్వం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇప్పటికే సన్నిహితులకు చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న శశికళ ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం రాజకీయ సన్యాసం చేస్తే ప్రజల్లో, పార్టీలో తనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుందని శశికళ భయపడుతున్నారు.

Before Sasikala’s elevation, Panneerselvam exit was done and Dusted

అదే జరిగితే తన రాజకీయ జీవితం మనుగడకే కష్టం అవుతుందని భయపడుతున్న శశికళ పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని వర్తమానం పంపించారు. అయితే శశికళ నేతృత్వంలోని ప్రభుత్వంలో తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకోనని పన్నీర్ సెల్వం భీష్మించుకున్నట్లు ఆయన వర్గీయులు అంటున్నారు.

ఇదే సమయంలో పన్నీర్ సెల్వం వర్గంలోని ఆరు మంది మంత్రుల మీద వేటుపడుతున్నదని వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం శశికళను సైతం కలవడానికి ఆసక్తిచూపించడం లేదని సమాచారం. అయితే చిన్నమ్మ వర్గంలోని సెంగోట్టయ్యన్, సెంథిల్ బాలాజీ, రంగస్వామి తదితర ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో బెర్తు కోసం నానా తంటాలు పడుతున్నారు.

<strong>పన్నీర్ కు మూడోసారి కన్నీరే: కీలుబొమ్మా ? బలిపశువా ?</strong>పన్నీర్ కు మూడోసారి కన్నీరే: కీలుబొమ్మా ? బలిపశువా ?

పన్నీర్ సెల్వం ప్రాతినిథ్యం వహిస్తున్న తేని జిల్లాలోని పోడి నియోజక వర్గంలో శశికళకు వ్యతిరేకంగా మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించాలని నినాదాలు చేస్తున్నారు. అయితే శశికళకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి పన్నీర్ సెల్వం సర్దిచెప్పడానికి ప్రయత్నించలేదు.

శశివకళ వర్గంపై మౌనంగా పన్నీర్ సెల్వం తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ షయంపై శశికళ వర్గీయులు మరింత ఆందోళనకు గురౌతున్నారు. మొత్తం మీద పన్నీర్ సెల్వం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారని ఆయన వర్గీయులు అంటున్నారు.

English summary
Mr Panneerselvam, has stepped into the breach twice earlier after Ms Jayalalithaa, as the Chief Minister, was arrested on charges of corruption.After Ms Sasikala accepted the post of the party general secretary, there have been calls for Mr Panneerselvam to step down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X