బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Belagavi border:మహారాష్ట్ర, కర్ణాటక సీఎం చర్చలు, ఏం మాట్లాడారంటే ?, బిక్కుబిక్కుమని ప్రజలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి/ముంబాయి: కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి (కర్ణాటకలోని జిల్లా కేంద్రం) వివాదం చిలికిచిలికి గాలివానలా తయారై చివరికి తుఫానుగా మారింది. బెళగావి మాదే అంటూ మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు, రాజకీయ నాయకులు బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు. బెళగావి ఎవడి అబ్బసొత్తు కాదు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెళగావి మీద మాకే హక్కు ఉంది అంటూ కన్నడిగులు ఆందోళనకుదిగారు. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. ఇదే సందర్బంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే బెళగావి వివాదం సుప్రీం కోర్టులో ఉంది.

Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?

దశాదాభ్దాలుగా బెళగావి కోసం గొడవలు

కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి జిల్లాలో మరోసారి కన్నడిగులు, మరాఠీల ఆధిపత్యపోరు మొదలైయ్యింది. బెళగావి మాదే అంటూ మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో కన్నడిగులు మండిపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెళగావి మీద మాకే హక్కు ఉంది అంటూ కన్నడిగులు ఆందోళనకుదిగారు.

మహారాష్ట్ర వాహనాలపై దాడులు

మహారాష్ట్ర వాహనాలపై దాడులు

మంగళవారం కర్ణాటక రక్షణావేదిక అధ్యక్షుడు నారాయణగౌడ వర్గంలోని కరవే కార్యకర్తలు బెళగావిలో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో వందాలాది మంది కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహారాష్ట్ర రిజిస్టర్ నెంబర్ ఉన్న పలు వాహనాల మీద కరవే కార్యకర్తలు దాడులు చేసి ఆ వాహనాల నెంబర్ ప్లేట్లు లాగేసి నిరసన వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాల సీఎంలు చర్చలు

రెండు రాష్ట్రాల సీఎంలు చర్చలు

మంగళవారం రాత్రి కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే చర్చలు జరిపారు. ఫోన్ లో మాట్లాడుకున్న సీఎంలు బసవరాజ్ బోమ్మయ్, ఏక్ నాథ్ షిండే బెళగావి విషయంలో చాలాసేపు చర్చలు జరిపారు. ఈ వియంలో కర్ణాటక మఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

శాంతియుతంగా ఉండాలి.... కోర్టు తీర్పుపై గౌరవం ఉంది

శాంతియుతంగా ఉండాలి.... కోర్టు తీర్పుపై గౌరవం ఉంది

బెళగావి విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలో శాంతిని కాపాడాలని తాము ఏక్ నాథ్ షిండే చర్చించుకున్నామని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు శాంతిని కాపాడాలని, చట్టపరంగా బెళగావి కోసం తాము కోర్టులో న్యాయపోరాటం చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ వివరించారు. బెళగావి జిల్లా ప్రజలు శాంతియుతంగా ఉండాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మనవి చేశారు.

English summary
Belagavi border Row; Maharashtra CM Eknath Shinde phone call to Karnataka CM Basavaraj Bommai. Both agreed that there should be peace and law and order to be maintain in both the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X