బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Border: అసెంబ్లీలో తీర్మాణం, బెళగావి, ఆ ఏరియాలు అన్నీ మావే, ఇద్దరు సీఎంల వార్, మ్యాటర్ ముదిరితే !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/బెంగళూరు: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. బెళగావి జిల్లా మాదే, ఒక్క ఇంచి భూమి కూడా మహారాష్ట్రకు వదిలిపెట్టమని, ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అసెంబ్లీ సమావేశంలో తేల్చి చెప్పారు. కర్ఱాటక ప్రభుత్వం మరాఠీలకు ద్రోహం చేస్తోందని, బెళగావితో పాటు కారవార, బీదర్, నిప్పాణి కూడా మాదే అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టడంతో హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది, మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం కావడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

Lady SI: భర్తను చంపాలని రూ. 10 లక్షలు ఇచ్చిన లేడీ ఎస్ఐ, కారు డ్రైవర్ తో మేడమ్ ?, దృశ్యం సినిమా !Lady SI: భర్తను చంపాలని రూ. 10 లక్షలు ఇచ్చిన లేడీ ఎస్ఐ, కారు డ్రైవర్ తో మేడమ్ ?, దృశ్యం సినిమా !

కర్ణాటక సీఎం

కర్ణాటక సీఎం

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి జిల్లా మాదే, ఒక్క ఇంచి భూమి కూడా మహారాష్ట్రకు వదిలిపెట్టమని, ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ బెళగావిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మాణానికి కాంగ్రెస్. జేడీఎస్ కూడా మద్దతు తెలిపింది. బెళగావి కర్ణాటకలో భాగం అని అందరూ తేల్చి చెప్పారు. బెళగావి విషయంలో కర్ణాటకలో పార్టీలకు అతీతంగా అందరూ ఏకం అయ్యారు.

నేల, నీరు, బాష కోసం పోరాటం

నేల, నీరు, బాష కోసం పోరాటం

కర్ణాటకలోని కన్నడిగుల నేల, నీరు, భాష మరియు ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై మేము రాజీపడము, కర్ణాటక ప్రజలు మనోభావాలను గౌరవిస్తాము, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మనమంతా ఐక్యంగా ఉండాలని, మహారాష్ట్ర ప్రజలు అనవసరంగా సృష్టించిన సరిహద్దు వివాదాలను ఖండిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ సభ కట్టుబడి ఉంటుందని ఇటీవల బసవరాజ్ బోమ్మయ్ శాసన సభ సమావేశాల సందర్బంగా ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టారు.

కర్ణాటక మరాఠీలకు ద్రోహం చేస్తోంది

కర్ణాటక మరాఠీలకు ద్రోహం చేస్తోంది

కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దు వివాదం ఇప్పుడే సమసిపోయేలా కనిపించడం లేదు, ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటూ బసవరాజ్ బోమ్మయ్ బెళగావి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా అదే తరహాలో అక్కడి సంకీర్ణ ప్రభుత్వం తీర్మానం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కర్ణాటక మరాఠీ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోందని, దీనిని మా ప్రభుత్వం ఖండిస్తన్నదని అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ప్రవేశపెట్టిన తిర్మాణానికి ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

అమిత్ షా ఎంట్రీ ఇచ్చినా ?

అమిత్ షా ఎంట్రీ ఇచ్చినా ?

కర్ణాటకలో వచ్చే ఏడాది శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో బెళగావి వివాదంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నప్పటికీ ఈ వివాదానికి తెరపడలేదు. మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నా బెళగావి విషయంలో వివాదం బాగా ముదరిపోయి వివాదం మరింత పెద్దది అయ్యింది. బెళగావిలో మరాఠీ బాష మాట్లాడే గ్రామాలు 865 ఉన్నాయని, వీటిని మహారాష్ట్రలో కలిపేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో తీర్మానం చెయ్యడంతో వివాదం ఇంకా పెద్దది అయ్యింది.

బెళగావి, కారవార, బీదర్, నిప్పాణి కూడా మావే

బెళగావి, కారవార, బీదర్, నిప్పాణి కూడా మావే

సరిహద్దు వివాదంలో సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. బెళగావి మాత్రమే కాదని కారవార, బీదర్, నిప్పాణి, భాల్కీలోని ప్రతి అంగుళం మహారాష్ట్రలో భాగమవుతుంది, ఇది జరిగే వరకు మేము నిద్రపోమని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కన్నడిగులు, కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని, ఇది మంచిదికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ తీర్మాణాన్ని మాజీ సీఎం సిద్దరామయ్య ఖండించారు.

కేంద్ర పాలిక ప్రాంతాలు, మాజీ సీఎం డిమాండ్

కేంద్ర పాలిక ప్రాంతాలు, మాజీ సీఎం డిమాండ్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనాను ఆక్రమించినట్లే కర్ణాటకలోని బెళగావి మీద మహారాష్ట్ర ప్రజలు దండయాత్ర చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారని సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో పెద్ద రాద్దాంతం అయ్యింది. మహారాష్ట్ర- కర్ణాటక మధ్య సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు బెళగావి, బీదర్, కారవార, నిప్పాణిలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మొత్తం మీద బెళగావి సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాల నాయకులు రోజుకు ఒక వివాదస్పాద వ్యాఖ్యలు చెయ్యడం పరిస్థితి చెయ్యిదాటిపోతందని స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Belagavi, Karawara, Bidar, Nippani in Karnataka are ours, Maharashtra CM Ek Nath Shinde sensational comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X