బాలికపై కరాటే మాస్టర్ లైంగిక దాడి: బెంగళూరులో చెట్టుకు కట్టేసి దుమ్ములేపేశారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉన్న తన భార్య మొదటి భర్త కుమార్తె మీద (సవతి కుమార్తె) మీద ఓ కామాంధుడు లైంగిక దాడి చెయ్యడంతో స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన బెంగళూరు నగరంలోని బెళ్లందూరు పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది.

జానకి అనే మహిళ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తన 14 ఏళ్ల కుమార్తెతో కలిసి బెళ్లందూరు సమీపంలో నివాసం ఉంటున్నది. కరాటే మాస్టర్ రామ్ రాజ్ అనే వ్యక్తిని జానకి రెండవ పెళ్లి చేసుకుంది. రామ్ రాజ్ కూడా వీరితో కలిసే ఉంటున్నాడు.

Bellandur police has arrested a man, who has sexually assaulted a minor girl.

జానకి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నది. రామ్ రాజ్ కరాటే మాస్టర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం జానకి ఉద్యోగానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటిలో జానకి మొదటి భర్త కుమార్తె, రామ్ రాజ్ ఇద్దరే ఉన్నారు. ఎప్పటి నుంచి సవతి కుమార్తె మీద కన్ను వేసిన రామ్ రాజ్ ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

బాలిక గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వారు వచ్చి బాలికను రక్షించి రామ్ రాజ్ ను చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న బెళ్లందూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రామ్ రాజ్ ను అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru, Bellandur police has arrested a man, who has sexually assaulted a minor girl.
Please Wait while comments are loading...