గాలి జనార్దన్ రెడ్డి అత్త మీద చీటింగ్ కేసు, ఆర్ టీసీ, ఎన్ని కోట్లు అంటే ?

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, ఆ రాష్ట్రంలో గంగావతి నియోజక వర్గం కేఆర్ పీ పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి అత్త రెడ్డి నాగలక్ష్మమ్మ, బీకే నాగరాజ్‌లపై బళ్లారి నగరంలోని బ్రూస్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. బళ్లారి మాజీ ఎమ్మెల్యే ఎం.దివాకర్ బాబు కుమారుడు, కాంగ్రెస్ పార్టీ యువనేత ఎం.హనుమ కిషోర్ ఫిర్యాదు చెయ్యడంతో గాలి జనార్దన్ రెడ్డి అత్త రెడ్డి నాగలక్ష్మమ్మ మీద కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఎం. హనుమ కిషోర్ తన ఆస్తుల్లో ఒకటైన ఆస్తిని గాలి జనార్దన్ రెడ్డి అత్త రెడ్డి నాగలక్ష్మమ్మకు నియమాల ప్రకారం సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించడం, కొనుగోలు డీడ్ రద్దు చేయడం, ఒప్పందం ప్రకారం ఆస్తి కొనుగోలు కోసం జారీ చేసిన చెక్కులు బ్యాంకులో జమ చేయబడ్డాయి.

Bellary

కానీ హనుమ కిషోర్ కు ఇచ్చిన చెక్ లు ఉన్న అకౌంట్ డబ్బు లేకపోవడంతో గాలి జనార్దన్ రెడ్డి అత్త మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు హనుమ కిషోర్‌కు బళ్లారిలోని కేఎస్ఆర్ టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నల్లచెరువు ప్రాంతంలో 43, 920 చదరపు అడుగుల భూమి ఉంది.

షేగిరా టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు అయిన రెడ్డి నాగలక్ష్మమ్మ, బీకే..నాగరాజు అనే వ్యక్తులను 04.05.2023న భూమి కొనుగోలు చెయ్యడానికి కచ్చితమైన డీడ్ చేయడానికి బేరం కుదుర్చుకున్నారు. అనంతరం అడ్వాన్స్‌గా హనుమ కిషోర్ కు రూ.20 కోట్ల చెక్కు ఇచ్చారు. ఆ సమయంలో భూమి కొనుగోలుదారులు నాగలక్ష్మమ్మ, బీకే నాగరాజ్ 01.08.2023న చెక్కును ఎన్‌క్యాష్ చేయమని హనుమ కిషోర్‌ను అభ్యర్థించారు.

అయితే తర్వాత 27.07.2023న తమ లాయర్ల ద్వారా హనుమ కిషోర్‌కి నోటీసులు ఇచ్చిన నాగలక్షమ్మ, బీకే .నాగరాజ్‌లు చెప్పిన ఆస్తిని కొనుగోలు చేయడం కుదరదని, అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించలేమని, ఇప్పటికే కొనుగోలు పత్రం ఉందని చెప్పారు. ఒప్పందాన్ని రద్దు చేయాలని హనుమ కిషోర్ కు నోటీసులు ఇచ్చారు. 02.08.2023న హనుమ కిషోర్ రూ.20 కోట్ల చెక్కును ఎన్‌క్యాష్‌మెంట్ కోసం బ్యాంక్‌లో డిపాజిట్ చేశాడు.

Bellary

అయితే నాగలక్ష్మమ్మ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోవడంతో ఆ మ్యాటర్ బ్యాంకు సిబ్బంది ఆయనకు చెప్పారు. కొనుగోలుదారు రెడ్డి నాగలక్ష్మమ్మ, నాగరాజ్ జారీ చేసిన చెక్కుల ఖాతాలో డబ్బులు లేవని తేలింది. ఈ నేపథ్యంలో హనుమ కిషోర్‌పై గాలి జనార్దన్ రెడ్డి అత్త మీద చీటింగ్ కేసు పెట్టారు. బళ్లారి సిటీలోని బ్రూస్ టౌన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+