వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM: గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్ ?, బళ్లారికి వందల కోట్ల నిధులు ఇచ్చేసిన సీఎం, డేట్ ఫిక్స్, తరువాత ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకు బీజేపీకి సినిమా కనపడుతుందని కొందరు అంటున్నారు. అయితే కర్ణాటక సీఎంతో సహ బీజేపీ నాయకులు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకు బీజేపీ ప్రభుత్వం బళ్లారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. వంద కోట్లు కాదు, రెండు వందల కోట్లు కాదు కాదు అంతకంటే మించి అనే రైంజ్ లో వందల కోట్ల రూపాయల నిధులు బళ్లారికి ఇచ్చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?

గాలి దెబ్బకు భారీగా నిధులు

గాలి దెబ్బకు భారీగా నిధులు

మైనికంగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసింది. బళ్లారి, విజయనగర, చిత్రదుర్గ, రాయచూరు తదితర జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డికి భారీగా అభిమానులు, అనుచరులు ఉన్నారు. బీజేపీలో ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డి ఆయన జైలుకు వెళ్లక ముందు వరకు ఆయన అనుచరులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని కొందరిని మంత్రులను చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజీయ పార్టీలోని బీజేపీకి చెందిన నాయకులు అధిక సంఖ్యలో వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం బళ్లారి జిల్లాకు ఊహించని విధంగా వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది.

బళ్లారిలో సీఎం టూర్

బళ్లారిలో సీఎం టూర్

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ జనవరి 4న బళ్లారిలో పర్యటించనున్నారని బళ్లారి జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ మాలపాటి మీడియాతో మాట్లాడుతూ సీఎం బసవరాజ్ బోమ్మయ్ బళ్లారి జిల్లాలో సుమారు 500 కోట్ల రూపాయలతో వివిధ పనులకు భూమిపూజ, నూతన భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బళ్లారి నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పవన్ కుమార్ వివరాలు వెళ్లడించారు.

బళ్లారికి బంపర్ ఆఫర్

బళ్లారికి బంపర్ ఆఫర్

సుమారు రూ.25 కోట్లతో నిర్మించిన నూతన జిల్లా కార్యాలయ సముదాయ భవనం, రూ.6 కోట్లతో నిర్మించిన సింథటిక్ అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్‌ను సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రారంభిస్తారని పవన్ కుమార్ అన్నారు. విమ్స్‌ ఆసుపత్రిలో రూ. 109 కోట్ల రూపాయలు, జిల్లా ట్రజరీ కార్యాలయానికి రూ. 21 కోట్ల రూపాయల,. 100 పడకల తల్లీ, పిల్లల ఆసుపత్రి, 100 పడకల ఎంఎన్‌హెచ్ ఆసుపత్రి, తారానాథ్ ఆయుర్వేద ఆసుపత్రిలో వసతి గృహ భవన ప్రారంభోత్సవం, హలకుండి, ముందరగిలో భూపట్టా పంపిణీ, భూమిపూజ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పాల్గొంటారని కలెక్టర్ పవన్ కుమార్ వివరించారు.

కొత్త భవనాల్లో వివిద శాఖల ఆఫీసులు

కొత్త భవనాల్లో వివిద శాఖల ఆఫీసులు

నూతనంగా ప్రారంభించిన జిల్లా కార్యాలయాల సముదాయంలో తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖతోపాటు వివిధ శాఖలకు చెందిన 11 కార్యాలయాలు నూతన భవనంలో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ చెప్పారు. పాత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, ల్యాండ్ సర్వే విభాగం కార్యాలయాలు పనిచేస్తాయని బళ్లారి జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ తెలిపారు.

గ్రాండ్ గా బళ్లారి ఉత్సవాలు

గ్రాండ్ గా బళ్లారి ఉత్సవాలు

జనవరి 21, 22 తేదీల్లో బళ్లారి ఉత్సవ్ గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలైనాయి. బళ్లారి జిల్లా విభజన తర్వాత తొలిసారిగా జనవరి 21, 22 తేదీల్లో బళ్లారి ఉత్సవ్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. బళ్లారి నగరంలోని డాక్టర్ రాజ్‌కుమార్‌ రోడ్డులోని మున్సిపల్‌ కళాశాల మైదానంలో హంపి ఉత్సవ్‌ తరహాలో బళ్లారి ఉత్సవ్‌ను రెండు రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహించనున్నామని పవన్ కుమార్ తెలిపారు. బళ్లారి ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఎద్దుల పోటీలు, లేజర్ షోలు

ఎద్దుల పోటీలు, లేజర్ షోలు

పండ్ల ,పూల ప్రదర్శన, మారథాన్, గాలిపటాలు ఎగరవేయడం, రంగోలి పోటీలు, లేజర్ షో, రెజ్లింగ్ టోర్నమెంట్, ఎద్దుల బండి ఊరేగింపు, ఆహార ప్రదర్శన, తృణధాన్యాల ప్రదర్శన వంటి వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఇక నగరంలోని కోట ప్రాంగణంలో విద్యుత్ దీపాలంకరణ చేయనున్నట్లు తెలిపారు. బళ్లారి ఉత్సవ్‌లో అలంకరించిన ఏనుగు అంబారీ, ప్రత్యేక అశ్విక దళం, ముఖ్యంగా రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి 300 కళా బృందాలతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

English summary
Bellary district Rs. 500 crores of funds sanctioned by the BJP government, ex-minister Gali Janardhan Reddy's new party effect?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X