బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Benami: గురూజీ హత్యకు అసలు కారణం బినామీ ఆస్తులు ?, అందుకే పక్కాప్లాన్ తో చంపేశారని ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కర్ణాటకకు చెందిన ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని కిరాతకంగా హత్య చేసిన నిందితులను హుబ్బళి పోలీసులు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు. చాలా సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకంగా పని చేస్తూ ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా చంపేసి చాకచక్యంగా తప్పించుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బినామీ ఆస్తుల కారణంగా చంద్రశేఖర్ గురూజీ హత్యకు గురైనారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.

CCTV: గురూజీ హంతకులు గంటల్లో చిక్కిపోయి ?, గురూజీ అపార్ట్ మెంట్ లో హంతకుడి భార్యతో !CCTV: గురూజీ హంతకులు గంటల్లో చిక్కిపోయి ?, గురూజీ అపార్ట్ మెంట్ లో హంతకుడి భార్యతో !

చంద్రశేఖర్ గురూజీని ఆయన దగ్గర సహాయకుడిగా పని చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్, అతని అనుచరుడు మంజునాథ్ మరెవాడా హత్య చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో హుబ్బళిలో పోలీసులు అరెస్టు చేశారు. చాలా సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ గురూజీ దగ్గర మహంతేష్ చాలా నమ్మకంగా పని చేస్తున్నాడని పోలీసులు అన్నారు.

 Benami: Murdered saral vastu Chandrashekhar Guruji make property on employees name in Hubballi in Karnataka.

గురూజీ సొంత అపార్ట్ మెంట్ లోనే హంతకుడు అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. హంతకుడి అపార్ట్ మెంట్ వెనుక అపార్ట్ మెంట్ లో చంద్రశేఖర్ గురూజీ నివాసం ఉంటున్నారు. అయితే సొంత అపార్ట్ మెంట్ ఇచ్చిన గురూజీ వేరే అపార్ట్ మెంట్ లో ఎందుకు నివాసం ఉంటున్నారు ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

చంద్రశేఖర్ గురూజీ ఆయన శిష్యుడు మహంతేష్ కు పెళ్లి చేశాడని పోలీసులు అన్నారు. హుబ్బళిలోని గోకుల్ రోడ్డులోని డెక్తాన్ వెనుక భాగంలోని చంద్రశేఖర్ గురూజీ సొంత అపార్ట్ మెంట్ లో మహంతేష్, అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

ACB: మాజీ మంత్రి, ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ఏసీబీ, ఇల్లు, గెస్ట్ హౌస్, అపార్ట్ మెంట్, ఆఫీసుల్లో, ఢిల్లీ దెబACB: మాజీ మంత్రి, ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ఏసీబీ, ఇల్లు, గెస్ట్ హౌస్, అపార్ట్ మెంట్, ఆఫీసుల్లో, ఢిల్లీ దెబ

అసలు మ్యాటర్ తెలిసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. చంద్రశేఖర్ గురూజీ ఆయన ఆస్తులు చాలా వరకు నమ్మకమైన శిష్యుల పేరుతో పెట్టారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రశేఖర్ గురూజీ బినామీ ఆస్తులు చాలా వరకు హంతకుడు మహంతేష్ పేరు మీద ఉన్నాయని, అందుకే ఆయన్ను హత్య చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని స్కెచ్ వేశారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా అంటోంది.

English summary
Benami: Murdered saral vastu Chandrashekhar Guruji make property on employees name in Hubballi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X