వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత సీటు నుంచే మమత పోటీ -సీఎం కోసం టీఎంసీ ఎమ్మెల్యే త్యాగం -శాసన మండలిపై గందరగోళం

|
Google Oneindia TeluguNews

మోదీ-షా నేతృత్వంలోని బీజేపీని ధీటుగా నిలువరిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించింది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ). కానీ అధినేత్రి దీదీ మాత్రం నందిగ్రామ్ స్థానంలో ఓటమిపాలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణం చేసిన మమత.. ఆరు నెలల్లోగా ఏదో ఒక సీటు నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సిన పరిస్థితిలో తన పాత సీటులోనే ఆమె పోటీకి దిగబోతున్నట్లు తెలుస్తోంది..

షాకింగ్: ప్రధాని మోదీ కన్నీరు -కొవిడ్ మరణాలపై భావోద్వేగం -మహమ్మారితో పోరు సుదీర్ఘం -వారణాసికి వందనంషాకింగ్: ప్రధాని మోదీ కన్నీరు -కొవిడ్ మరణాలపై భావోద్వేగం -మహమ్మారితో పోరు సుదీర్ఘం -వారణాసికి వందనం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ప్రయత్నాలను మొదలుపెట్టారు. తాజా ఎన్నికల్లో బీజేపీతో సవాళ్లకుపోయి నందిగ్రామ్ లో పోటీచేసిన ఆమె తన మాజీ అనుచరుడు సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉండగా, దీదీ తనకు బాగా పట్టున్న పాత స్థానం భవానీపూర్ నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ..

bengal cm Mamata likely to contest from her old seat Bhabanipur, sitting MLA vacates seat

భవానీపూర్ స్థానంలో మమత పోటీ చేయడానికి మార్గం సుగమం చేయడం కోసం ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. భవానీపూర్‌లో శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయకు ఈ ఎన్నికల్లో 57.71 శాతం ఓట్లు లభించాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతారని టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి

 కేసీఆర్‌కు కొవిడ్ రోగుల జిందాబాద్ -వరంగల్ ఎంజీఎంలో సీఎం తనిఖీ -ఫేస్ షీల్డ్, అనూహ్య వినతులు కేసీఆర్‌కు కొవిడ్ రోగుల జిందాబాద్ -వరంగల్ ఎంజీఎంలో సీఎం తనిఖీ -ఫేస్ షీల్డ్, అనూహ్య వినతులు

ఎమ్మెల్యే కాని వ్యక్తి సీఎంగా లేదా మంత్రిగా పదవి చేపడితే ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుందని రాజ్యాంగంలోని 164వ అధికరణం చెప్తున్న దరిమిలా బెంగాల్ లో దశాబ్దాల కిందట రద్దయిన శాసన మండలి వ్యవస్థను పునరుద్ధరించడం లేదా ఏదో ఒక స్థానం నుంచి శాసనసభకే పోటీచేయడం మమతకు ఆప్షన్లుగా ఉన్నాయి. 1960ల్లో రద్దయిన బెంగాల్ శాసన మండలిని మమత పునరుద్దరించబోతున్నారంటూ రెండు రోజుల కిందట వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దీదీ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే త్యాగానికి సిద్ధం కావడం అదీగాక చనిపోయిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా గెలిచిన బీజేపీ ఎంపీల రాజీనామాలతో ఇప్పటికే బెంగాల్ లో ఐదు సీట్లు ఖాళీ అయినందున మమత ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తేలికగా మారింది. దీంతో మండలి పునరుద్దరణపై గందరగోళం ఏర్పడింది.

English summary
West Bengal Chief Minister and TMC supremo Mamata Banerjee is likely to contest bypoll from the Bhabanipur assembly constituency as sitting MLA Sobhandeb Chattopadhyay resigned from the seat on Friday. Chattopadhyay formally submitted his resignation to West Bengal Legislative Assembly Speaker Biman Bandyopadhyay in his Assembly chamber in presence of party leader and state minister Partha Chatterjee and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X