మమత బెనర్జీ గురుతులను చెరిపేస్తోన్న సువేందు

పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా మరో అనూహ్య చర్యకు దిగింది సువేందు సర్కార్. కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియం వెలుపల మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్మించిన ఓ భారీ విగ్రహాన్ని కూల్చివేసింది. దాన్ని నామరూపాల్లేకుండా తొలగించిపడేసింది. ఫుట్ బాల్ థీమ్డ్ విగ్రహం ఇది. మమత బెనర్జీ స్వయంగా దీన్ని డిజైన్ చేశారు. 2017లో ఫీఫా అండర్-17 ప్రపంచ కప్‌కు ముందు సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేట్ సమీపంలో ఇది నిర్మితమైంది. ఈ విగ్రహంపైన 'విశ్వబంగ్లా' లోగో ఉండేది.

Bengal Govt Removes Grotesque Football-Themed Iconic Salt Lake Statue designed Mamata Banerjee

ఈ ఉదయం ఈ విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. దీంతో.. సంవత్సరాల తరబడి చారిత్రక సాల్ట్ లేక్ స్టేడియానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ఈ శిల్పం.. తాజాగా సువేందు ప్రభుత్వ నిర్ణయంతో చరిత్రలో కలిసిపోయింది. క్రీడా మంత్రి నితిష్ ప్రామాణిక్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ విగ్రహాన్ని తొలగించారు. బూట్ల వరకు విగ్రహాన్ని ఉంచి మొత్తాన్ని కూలదోశారు. ఈ పరిణామం క్రీడా చరిత్రలో ఒక అధ్యాయాన్ని ముగించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

డిజైన్ కారణంగా ఈ విగ్రహం తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వచ్చింది. దీని విషయంలో జనం రెండుగా విడిపోయారు. మొండెం లేని విగ్రహం ఇది. ఓ ఫుట్ బాల్ ప్లేయర్ రెండు కాళ్లను నడుం వరకు మాత్రమే కనిపించేలా ఈ విగ్రహం నిర్మితమైంది. మొండెం స్థానంలో ఓ ఫుట్‌బాల్‌ను ఉంచారు. విగ్రహం రూపంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రెండు కాళ్లు, దానిపై ఫుట్ బాల్ మాత్రమే కనిపించేలా చేయడం విమర్శలకు దారితీసింది. శరీరం అంతా ఫుట్ బాల్ కు అంకితం చేసినట్లుగా దీన్ని డిజైన్ చేశారనే పొగడ్తలూ ఉన్నాయి.

దీనిపై నితీష్ ప్రామాణిక్ మాట్లాడారు. ఈ శిల్పాన్ని తృణమూల్ కాంగ్రెస్ పతనానికి ముడిపెట్టారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే మమత బెనర్జీ ప్రభుత్వానికి కష్టకాలం ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. విగ్రహం ప్రతిష్ఠ అనంతరం లియోనెన్ మెస్సీ వివాదం తలెత్తిందని గుర్తు చేశారు. తాజాగా ఆమె ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+