షాక్: ప్రియుడితో భర్త చావుకేకలు విని సంతోషంతో చంపేయమంది

ఏడాది క్రితమే ఆమెకు పెళ్ళైంది. కానీ, వివాహానికి ముందే ఆమెకు మరో వ్యక్తితో ప్రేమ వ్యవహరాన్ని కొనసాగిస్తోంది. భర్త ఆమె కంటే ఆరేళ్ళు పెద్దవాడు. ప్రియుడు ఆమె కంటే రెండేళ్ళు చిన్నవాడు.అయితే భర్తతో కలిసి ఉం

కోల్ కతా: ఏడాది క్రితమే ఆమెకు పెళ్ళైంది. కానీ, వివాహానికి ముందే ఆమెకు మరో వ్యక్తితో ప్రేమ వ్యవహరాన్ని కొనసాగిస్తోంది. భర్త ఆమె కంటే ఆరేళ్ళు పెద్దవాడు. ప్రియుడు ఆమె కంటే రెండేళ్ళు చిన్నవాడు.అయితే భర్తతో కలిసి ఉండడం కంటే ప్రియుడితో కలిసి ఉండాలని భావించింది.ఆమె భర్తను చంపించింది. భర్త చావుకేకను ఫోన్లో విని సంతోషించింది.ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

మనువా మజుందార్ అనే మహిళ పశ్చిమబెంగాల్ లోని బరసాత్ మున్సిపాలిటీలో క్యాజువల్ వర్కర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త అనుపమ్ సిన్హా ఓ ట్రావెల్ ఏజెన్సీలో మేనేజర్ . అజిత్ రాయ్ ఆమెకు కాలేజీ రోజుల నుండి తెలుసు. అతడితో కలిసి ఉండాలని ఆమె నిర్ణయించుకొంది. భర్త హత్యకు పక్కాగా ప్లాన్ చేసింది.

Bengal woman ‘plots husband’s murder, wanted to hear him scream in agony’

అనుపమ్ ఉండే ప్లాట్ లోకి ముందుగానే మనువా ఇచ్చిన తాళాలతో చేరుకొన్న అజిత్ అతడు ఇంట్లోకి రాగానే ఒక ఇనుపరాడ్ తో తలమీద కొట్టాడు. ఆ తర్వాత అదే రాడ్ ను అతడి గొంతులోకి పోనిచ్చి మనువాకు ఫోన్ చేశాడు.

చావుభయంతో అతడుపెడుతున్న కేకలను విన్న మనువా అతడిని చంపేయాలని ప్రియుడికి సలహాఇచ్చింది. దీంతో అతడు మెదడులోని నరాలను కత్తితో కోసి మరీ దారుణంగా అనుపమ్ సిన్హాను హత్యచేశాడు.

అనుపమ్ మరణించిన తర్వాత అపార్ట్ మెంట్ అంతటినీ అజిత్ శుభ్రంచేశాడు. తర్వాతిరోజు గంగానదిలో స్నానంచేసి రక్తంతో తడిసిన తన దుస్తులను అనుపమ్ సెల్ ఫోన్ ను నదిలో పారేశాడు.

హత్య జరిగిన రెండు వారాల తర్వాత ప్రియుడిని, ప్రియురాలిని పోలీసులు అరెస్టుచేశారు. ఆమె విడాకులు తీసుకొని ప్రియుడిని పెళ్ళి చేసుకొని ఉండొచ్చు కానీ, భర్తను అంత క్రూరంగా చంపించడం ఎందుకని స్థానికులు ప్రశ్నించారు.

తన భార్య ప్రేమ విషయం అనుపమ్ కు తెలిసింది. ఆమెను తాను పెళ్ళిచేసుకొని ఉండాల్సింది కాదని ఆయన తరచూ వాపోయేవాడని అనుపమ్ సహోద్యోగి అభిషేక్ చటర్జీ అన్నారు. ఇంత జరిగినా తర్వాత కూడ మనువా మాత్రం కూల్ గా ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+