• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bengaluru: ఏసీబీ పంజా; నీటి పైపుల్లో రూ. 500 నోట్ట కట్టలు, పాలగిన్నెల్లో రూ. కోట్ల విలువైన నగలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అవినీతి అధికారులకు కాలింగ్ బెల్ వేసిన ఏసీబీ అధికారులు వాళ్ల బెల్ (గంట) పగిలిపోయే షాక్ ఇచ్చారు. కొంతకాలం క్రితమే అవినీతి అధికారుల లిస్టు తయారు చేసిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 60 చోట్ల దాడులు చెయ్యడంతో అవినీతి అధికారుల ఊపిరి ఆగిపోయే అంత పని అయ్యింది. ఇంతకాలం పేదలను, అమాయకులను పీడించి సంపాధించిన సొమ్మును ఏసీబీ అధికారులు బయటకు తీసి వాటిని సీజ్ చేస్తుంటే అవినీతి అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు అయ్యో దేవుడా మా సొమ్ము అంతా పోయిందే అంటూ లబోదిబో అన్నారు. వాటర్ లైన్ పైపుల్లో లక్షల రూపాయల నోట్ల కట్టలు, పాలగిన్నెలు, కుక్కర్లలో కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు బయటకు తీశారు. 15 మంది అవినీతి అధికారులు కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాధించారని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. ఒకే అధికారి ఇంటిలో రూ. 3.50 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 15 లక్షల క్యాష్ చిక్కింది అంటే మనోడు ఏ లెవల్లో అక్రమాస్తులు సంపాధించాడో అనే విషయం ఇట్లే అర్థం అయిపోతుంది. 8 మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, 300 మంది ఏసీబీ సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు.

Illegal affair: నలుగురు భర్తలు, ఇద్దరు ప్రియులు, గురువుతో వెళ్లి వస్తూ ఆంటీతో ?, ఫినిష్ !Illegal affair: నలుగురు భర్తలు, ఇద్దరు ప్రియులు, గురువుతో వెళ్లి వస్తూ ఆంటీతో ?, ఫినిష్ !

 60 ప్రాంతాల్లో సోదాలు

60 ప్రాంతాల్లో సోదాలు

అవినీతి అధికారులకు కాలింగ్ బెల్ వేసిన ఏసీబీ అధికారులు వాళ్ల బెల్ పగిలిపోయే షాక్ ఇచ్చారు. కొంతకాలం క్రితమే అవినీతి అధికారుల లిస్టు తయారు చేసిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 60 చోట్ల దాడులు చెయ్యడంతో అవినీతి అధికారుల ఊపిరి ఆగిపోయే అంత పని అయ్యింది.

 లిస్టు చాలా పెద్దది

లిస్టు చాలా పెద్దది

సకాల కేఏఎస్ అధికారి నాగరాజ్, బెంగళూరులోని యలహంక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు రాజశేఖర్, బీబీఎంపీ అధికారి మాయణ్ణ, బీబీఎంపీ ఉద్యోగి బాగలగుంటె గిరితో పాటు బెంగళూరులోని మరో ఇద్దరు అధికారుల మీద ఏసీబీ అధికారులు పంజా విసిరారు. ఈ అవినీతి అధికారులు కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు సంపాధించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఎవ్వరినీ వదల్లేదు

ఎవ్వరినీ వదల్లేదు

మంగళూరు స్మార్ట్ సిటీ ఇఇ కేఎస్. లింగేగౌడ, మండ్య హెచ్ఎల్ బీసీ ఇఇ శ్రీనివాస్, దోడ్బబళ్లాపురం రెవెన్యూ శాఖ అధికారి లక్ష్మినరసింహయ్య, మాజీ ప్రాజెక్టు మేనేజర్ వాసుదేవ్, బెంగళూరు నిర్మిత కేంద్రం మాజీ ప్రాజెక్టు మేనేజర్ అండ్ జనరల్ మేనేజర్ క్రిష్ణారెడ్డి, బెంగళూరు నందిని డైరీ జనరల్ మేనేజర్, గదగ్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టీఎస్, రుద్రేశప్ప, సహకార శాఖ అధికారి మస్తిల నివాసాలు, కార్యాలయాల మీద ఏసీబీ అధికారులు పంజా విసిరారు.

 జస్ట్ 7 కేజీల బంగారు నగలు, రూ. 15 లక్షలు క్యాష్

జస్ట్ 7 కేజీల బంగారు నగలు, రూ. 15 లక్షలు క్యాష్

గదగ్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టీఎస్ రుద్రేశప్ప ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు బిత్తరపోయారు. రుద్రేశప్ప ఇంటిలో వంట పాత్రలు, కుక్కర్లతో పాటు బీరువాలు, లాకర్లు, కబోడ్స్ లో సుమారు రూ. 3.50 కోట్లు విలువైన 7 కేజీల బంగారు నగలు, బంగారు బిస్కెట్లను అధికారులు గుర్తించారు. రుద్రేశప్ప ఇంటిలో మాత్రమే రూ. 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆ డబ్బు, నగలు ఎక్కడి నుంచి వచ్చాయి ? అంటూ రుద్రేశప్పను, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.

 నీటి పైపుల్లో నోట్ల కట్టలు

నీటి పైపుల్లో నోట్ల కట్టలు

కలబురిగిలో నివాసం ఉంటున్న పీడబ్ల్యూ శాఖ ఇంజనీరు శాంతేగౌడ నివాసంలో సోదాలు చేసిన అధికారులు బిత్తరపోయారు. ఇంటి గోడలకు ఏర్పాటు చేసిన నీటి పైపుల్లో అధికారులు రూ. 500 నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. పైపులు కోసిన అధికారులు రూ. 500 నోట్ల కట్టలు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నా ఆ నోట్ల కట్లు వస్తూనే ఉన్నాయి.

పక్కాస్కెచ్ వేసిన తండ్రి, కొడుకు

ఏసీబీ అధికారులు వస్తున్నారని సమాచారం అందడంతో శాంతేగౌడ, ఆయన కొడుకు మేడ మీద నుంచి నీళ్ల పైపుల్లో నోట్ల కట్టలు వేశారని తెలిసింది. పక్కా సమాచారం అందడంతో అధికారులు ప్లంబర్ ను పిలిపించి పైపులు కత్తిరించి నోట్ల కట్టలు మొత్తం బయటకు లాగేశారు. మొత్తం మీద కర్ణాటకలో ఏసీబీ అధికారుల దెబ్బకు అవినీతి అధికారులకు 70 ఎంఎం సీనిమా కనపడింది. 8 మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, 300 మంది ఏసీబీ సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు.

English summary
Bengaluru: ACB officials raided 60 locations in the Karnataka state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X