కౌగిలించుకోనా?: రోడ్డుపై అమ్మాయిల్ని అడిగాడు, ఐదు గంటల్లో అరెస్ట్
ఇద్దరు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిమ్మల్ని కౌగిలించుకుంటాను.. అని వారిని సదరు యువకుడు అడగడం గమనార్హం.
బెంగళూరు: ఇద్దరు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిమ్మల్ని కౌగిలించుకుంటాను.. అని వారిని సదరు యువకుడు అడగడం గమనార్హం. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతను నన్ను లాక్కెళ్లాడు, లైట్లు వేయడంతో..: బెంగళూరు బాధితురాలు

కౌగిలించుకోవాలా..
ఇద్దరు అమ్మాయిలు మంగళవారం నాడు సాయంత్రం రోడ్డు మీద వెళ్తున్నారు. వారు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో 22 ఏళ్ల యువకుడు వారిని పలకరించాడు. అంతేకాదు, కౌగిలించుకోవాలా.. అని అడిగాడు.

పారిపోయే ప్రయత్నం
అతని పేరు మణికంఠ. మహాలక్ష్మి లే అవుట్‌లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కాగా, తమతో అనుచితంగా ప్రవర్తించడంతో అమ్మాయిలు పెద్దల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసుుల అతనిని అరెస్టు చేశారు.

ఆ రోజు..
ఆ రోజు తాము వెళ్తుండగా అతని హగ్ చేసుకోమని అడిగాడని అమ్మాయిలు చెప్పారు. దీంతో వారు అరిచారు. అప్పుడు రోడ్డు పై నుంచి వెళ్తున్న వాళ్లు అతనిని పట్టుకొని, చితకబాదారు. వారి నుంచి అతను తప్పించుకొని పారిపోయాడు.

బెంగళూరు
ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వ్యాలికవల స్టేషన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఫిర్యాదు చేసిన అయిదు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, బెంగళూరులో ఇటీవల వరుసగా వేధింపుల సంఘటనలు కలకలం రేపాయి.












Click it and Unblock the Notifications