తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: ఆంధ్రా, ఓడిశా టూ బెంగళూరు, ఎన్ని కోట్లు డ్రగ్స్ సీజ్ అంటే ?, ఆంధ్రాలో అరెస్టు, ప్రతాప్ రెడ్డి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/విజయవాడ: ఐటీ హబ్ బెంగళూరులో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటుపడిన కొందరు శ్రీమంతులు, కొందరు కాలేజ్ అబ్బాయిలు, కొందరు టెక్కీలు ఇలా కొన్ని రంగాల వారిని టార్గెట్ చేసుకున్న ముఠాసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి రైళ్లలో బెంగళూరుకు పక్కాప్లాన్ తో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. రైలులో నుంచి డ్రగ్స్ ను మహిళ బయటకు తీసుకు వచ్చి డ్రగ్స్ డీలర్స్ కు ఇస్తోందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Manager: భార్య అకౌంట్ కు Rs. కోట్లు బదిలి చేసి బ్యాంక్ అధికారి ఎస్కేప్, అనంతపురం నుంచి ఎగేసుకుని వెళ్లి !Manager: భార్య అకౌంట్ కు Rs. కోట్లు బదిలి చేసి బ్యాంక్ అధికారి ఎస్కేప్, అనంతపురం నుంచి ఎగేసుకుని వెళ్లి !

బెంగళూరులో డ్రగ్స్ దందా

బెంగళూరులో డ్రగ్స్ దందా

బెంగళూరులో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు. దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం లెక్కలేనంత మంది బెంగళూరు వచ్చి వెలుతున్నారు. ఐటీ హబ్ గా పేరు తెచ్చుకున్న బెంగళూరులో డ్రగ్స్ దందా నిర్వహకులు పాగా వెయ్యడం, వారిని పోలీసులు అరెస్టు చెయ్యడం జరుగుతూనే ఉంది.

 ఎవరిని టార్గెట్ చేశారంటే ?

ఎవరిని టార్గెట్ చేశారంటే ?

విలాసాలకు అలవాటుపడిన శ్రీమంతులు, కాలేజ్ విద్యార్థులు, టెక్కీలు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు ఇలా కొన్ని రంగాల వారిని టార్గెట్ చేసుకున్న డ్రగ్స్ డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తున్న రైళ్లలో పక్కాప్లాన్ తో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది.

 కేఆర్ పురం రైల్వేస్టేషన్ లో ఏం జరిగిందంటే ?

కేఆర్ పురం రైల్వేస్టేషన్ లో ఏం జరిగిందంటే ?

ఈనెల 12వ తేదీ కేఆర్ పురం రైల్వేస్టేషన్ కు చేరుకున్న రైలులో గంజాయి, డ్రగ్స్ వచ్చింది. తరువాత మహిళతో సహ ముగ్గురు నిందితులు ఆ గంజాయి ఉన్న బ్యాగ్ లు, డ్రగ్స్ తీసుకుని రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చారు, ఆటోలు, బైక్ లో డ్రగ్స్ తీసుకుని డెలవరి ఇవ్వడానికి వెలుతున్న సమయంలో కెంపేగౌడ నగర పోలీసులు వారిని అరెస్టు చేశారని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు.

ఒడిశా టూ బెంగళూరుకు గంజాయి

ఒడిశా టూ బెంగళూరుకు గంజాయి

ఒడిశాకు చెందిన నవాబ్ పాషా, నూర్ అహమ్మద్, ఇమ్రాన్ పాషా, కిరణ్ అనే నిందితులు ఆ రాష్ట్రం నుంచి రైళ్లల్లో బెంగళూరుకు గంజాయి, డ్రగ్స్ తీసుకు వస్తున్నారని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. రైళ్లలో సీట్ల కింద గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మూటులు దాచిపెట్టి సాటి ప్రయాణికులకు అనుమానం రాకుండా స్కెచ్ వేశారని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు.

 ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ సీజ్

ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ సీజ్


ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాగర్ సాహు అలియాస్ సాగర్, శేషగిరి అనే నిందితులు రైళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి, డ్రగ్స్ కు పంపిస్తున్నారని, బెంగళూరులో ఆ డ్రగ్స్ ను నవాబ్ పాషా విక్రయిస్తున్నాడని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన బెంగళూరులోని జయనగర పోలీసులు రూ. 3.20 కోట్ల విలువైన గ్రడ్స్ సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు.

రూ. 5. 20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

రూ. 5. 20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం


ఒడిశాకు చెందిన నవాబ్ పాషా, నూర్ అహమ్మద్, ఇమ్రాన్ పాషా, కిరణ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాగర్ సాహు అలియాస్ సాగర్, శేషగిరి అనే నిందితులను అరెస్టు చేసి రూ. 5. 20 కోట్ల విలువైన 556 కేజీల గంజాయి, ఆరు కేజీల హశీష్ సీజ్ చేశామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు.

English summary
Bengaluru: Drugs seized and accused arrested by Bengaluru South zone police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X