flowers: బడ్జెట్ సమావేశాల్లో చెవిలో పువ్వులు, చూడటానికి బాగుందని చెప్పిన సీఎం. పువ్వులతో నవ్వులు !
విధాన సౌధలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దం అయిన సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య చెవిలో ఆరంజ్ కలర్ పువ్వు పెట్టుకున్నారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను శుక్రవారం విధాన సౌధాలో ప్రవేశ పెట్టారు. ఉదయం బెంగళూరులో ఓ ఆలయానికి వెళ్లిన బసవరాజ్ బోమ్మయ్ ప్రత్యేక పూజలు చేసి బడ్జెట్ పత్రాలు ఉన్న సూట్ కేస్ తీసుకుని నేరుగా విధాన సౌధకు వెళ్లారు. విధాన సౌధలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దం అయిన సమయంలో ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య చెవిలో ఆరంజ్ కలర్ పువ్వు పెట్టుకున్నారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకున్నారు. ఈ సందర్బంలో సిద్దరామయ్యను చూసిన కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ చేసిన వ్యాఖ్యలతో ఓ పక్క నవ్వులు, మరో పక్క నిరసనలతో అసెంబ్లీ సమావేశంలో గందరగోళం నెలకొనింది. అసలు ఏం జరిగిందంటే ?

బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం
కర్ణాటకలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను శుక్రవారం విధాన సౌధాలో ప్రవేశ పెట్టారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ బడ్జెట్ పత్రాలు ఉన్న సూట్ కేస్ తీసుకుని విధాన సౌధకు వెళ్లారు. కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం చివరి బడ్జెట్ సమావేశాలు ఇవే. విధాన సౌధలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దం కావడంతో రసవత్తరమైన సీన్ దర్శనం ఇచ్చింది.

చెవిలో పువ్వు పెట్టుకుని సైలెంట్ గా కుర్చున్న సిద్దూ
సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఎంట్రీతో అంత వరకు ఏదో చదువుకుంటూ కుర్చున్న సిద్దరామయ్య వెంటనే పక్కన ఉన్న ఆరంజ్ కలర్ పువ్వు తీసుకుని చెవిలో పెట్టుకున్నారు. సిద్దరామయ్యను ఫాలో అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వారి చెవిలో పూలు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సమావేశాలపై నిరసన వ్యక్తం చేసింది.

చూడటానికి చాలా బాగుందని చెప్పిన సీఎం
సిద్దరామయ్య తీరుతో సీఎం బసవరాజ్ బోమ్మయ్ నవ్వుకున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చెవిలో పువ్వు పెట్టారు. అందుకే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు చెవిలో పువ్వు పెట్టారు, త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు కన్నడిగులు కచ్చితంగా చెవిలో పువ్వు పెడుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం బసవరాజ్ బోమ్మయ్ వ్యంగంగా అన్నారు. కాంగ్రెస్ నాయకుల చెవిలో పూలు చూడముచట్టగా ఉన్నాయని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

రెచ్చిపోయిన సిద్దరామయ్య
సీఎం బసవరాజ్ బోమ్మయ్ వ్యాఖ్యలతో అంత వరకు సైలెంట్ గా కుర్చున్న మాజీ సీఎం సిద్దరామయ్య లేచి సీఎం మీద విరుచుకుపడ్డారు. మీరు 7 కోట్ల మంది కర్ణాటక ప్రజల చెవిలో పువ్వులు పెట్టారని, ఇంతకాలం ఇచ్చిన హామీలు ఇంత వరకు నేరవేర్చలేదని ఆరోపించారు. మీరు ప్రజల చెవిలో పువ్వు పెడితే మేము మా చెవిలో పువ్వులు పెట్టుకున్నామని సిద్దరామయ్య అన్నారు. ఏమైనా కాంగ్రెస్ నాయకుల చెవిలో పువ్వులు భలే ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు కేకలు వెయ్యడంతో కొంత సేపు సభలో గందరగోళం నెలకొనింది.
-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్











Click it and Unblock the Notifications