కర్ణాటకలో ఏ కులానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే , రెడ్డి వర్గంలో !
బెంగళూరు: ఎమ్మెల్యే కావడానికి, మంత్రి కావడానికి, సీఎం కావడానికి కులం కార్డు భలే పని చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలు అయిన వారిని మనం గమనిస్తే కులం లెక్కలు కనపడుతాయి. కులాల లెక్కలు, ఎమ్మెల్యేల లెక్కలు పోల్చుకుని ఇప్పటికే చాలా మంది సీఎంలు అయ్యారు.
కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కులాల లెక్కన ఎమ్మెల్యే సీట్లు పంపిణి చేశారు. ఒక్క బీజేపీ మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీం మతానికి చెందిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ముస్లీంలు, క్రిష్టియన్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది.

కర్ణాటకలో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎర్పాటు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తోంది. కురబ, ఒక్కలిగ కులానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య సీఎం సీటు కోసం గట్టి పోటీ ఉండటంతో వారివారి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఇక ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 66 సీట్లకే పరిమితం అయ్యింది.
జేడీఎస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కేఆర్ పీ పార్టీ నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా, సర్వోదయ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే అయ్యారు. కర్ణాటక అసెంబ్లీలో ఏ కులానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే విషయంలో పక్కాక్లారిటీ వచ్చింది.
కర్ణాటలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు ఒక్కొక్క కులానికి చెందిన ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీకి లింగాయత్ లు ఓటు బ్యాంక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి దళితులు, బీసీలు, ముస్లీం ఓటు బ్యాంక్ గా ఉంది. ఇక జేడీఎస్ పార్టీకి ఒక్కలిగులు ఓటు బ్యాంక్ గా ఉన్నారు. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజక వర్గాల్లో ఓటు బ్యాంక్ మొత్తం తారుమారు అయ్యింది.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అన్ని కులాలకు చెందిన నాయకులు పోటీ చేశారు. మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో కొన్ని వేల మంది ఓడిపోయారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కులానికి చెందిన వారు ఎంత మంది ఎమ్మెల్యేలు అయ్యారు ?, రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మంది విజయ సాధించారో చూద్దాం.

కర్ణాటక అసెంబ్లీలో ఏ కులానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే !
* లింగాయత్- 56 మంది ఎమ్మెల్యేలు
* ఒక్కలిగ- 46 మంది ఎమ్మెల్యేలు
* వాల్మీకి- 18 మంది ఎమ్మెల్యేలు
* ఎస్సీ ( కుడి వర్గం) 14 మంది ఎమ్మెల్యేలు
* కురబ (సిద్దరామయ్య వర్గం )- 12 మంది ఎమ్మెల్యేలు
* బ్రాహ్మణ- 10 మంది ఎమ్మెల్యేలు
* బిల్లవ ఈడిగ- 9 మంది ఎమ్మెల్యేలు
* ముస్లీం- 9 మంది ఎమ్మెల్యేలు
* ఎస్సీ (ఎడమ వర్గం)- 9 మంది ఎమ్మెల్యేలు
* రెడ్డీస్ (రెడ్డి)- 7 మంది ఎమ్మెల్యేలు
* ఎస్సీ ( వడ్డెర)- 7 మంది ఎమ్మెల్యేలు
* ఎస్సీ (లంబాణి)- 6 మంది ఎమ్మెల్యేలు
* బంట్స్- 5 మంది ఎమ్మెల్యేలు
* మరాఠ (మరాఠి)- 3 మంది ఎమ్మెల్యేలు
* బెస్త- మూడు మంది ఎమ్మెల్యేలు
* జైన్- ఇద్దరు ఎమ్మెల్యేలు
* ఎస్సీ (మోగర), క్రిస్టియన్, రాజపుత్, యాదవ (గొల్ల), బలిజ నాయుడు, బైరాగి కులానికి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కర్ణాటక అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కురుబ వర్గానికి చెందిన సిద్దరామయ్య, 46 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక్కలిగ కులానికి చెందిన డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. అయితే కురబ, ఒక్కలిగ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల్లో ఉన్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications