బెంగళూరు బార్ లో అగ్నిపమాదం, రూ. 5 లక్షలు పరిహారం, యజమాని రాడు, మేనేజర్!

Posted By:
Subscribe to Oneindia Telugu
Bengaluru Fire : బెంగళూరు రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం, వీడియో !

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కేఆర్ మార్కెట్ సమీపంలోని కైలాష్ బార్ అండ్ రెస్టారెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కర్ణాటక ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పన నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

మంత్రి జార్జ్

మంత్రి జార్జ్

బెంగళూరు నగరాభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్ కేఆర్ మార్కెట్ లోని కైలాష్ బార్ అండ్ రెస్టారెంట్ చేరుకుని పరిశీలించారు. అనంతరం విక్టోరియా ఆసుపత్రి చేరుకున్న మంత్రి కేజే, జార్జ్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 రూ. 5 లక్షలు పరిహారం

రూ. 5 లక్షలు పరిహారం

కైలాష్ బార్ అండ్ రెస్టారెంట్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి జార్జ్ చెప్పారు. కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

10 ఏళ్ల నుంచి యజమాని

10 ఏళ్ల నుంచి యజమాని


రాజాజీనగర్ కు చెందిన దయాశంకర్ కైలాష్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని అని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు. అనారోగ్యంతో గత 10 ఏళ్ల నుంచి దయాశంకర్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరకు రావడం లేదని, రాజాజీనగర్ కు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తూ అతనే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ చూసుకుంటున్నాడని మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.

జోబులో తాళం ఉన్నా ?

జోబులో తాళం ఉన్నా ?

విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగా కైలాష్ బార్ అండ్ రెస్టారెంట్ లో మంటలు వ్యాపించాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. విద్యుత్ షాక్ తో ఇద్దరు, ఊపిరాడక ముగ్గురు మరణించారని, జోబులో తాళం ఉన్నా మంటలు వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయారని, మేనేజర్ సోమశేఖర్ పరారైనాడని మంత్రి రామలింగారెడ్డి వివరించారు.

 ఫోరెన్సిక్ ల్యాబ్

ఫోరెన్సిక్ ల్యాబ్


కైలాస్ బార్ అండ్ రెస్టారెంట్ కు ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణలు భేటీ అయ్యి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. బార్ అండ్ రెస్టారెంట్ కు ఒక్క షట్టర్ మాత్రమే ఉందని, బయటకు రావడానికి వేరే మార్గం లేకపోవడంతో ఐదు మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని విచారణలో వెలుగు చూసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru Development Minister KJ George announced Rs.5 lakhs compensation for victims family who were died in Kailash bar and restaurant fire tragedy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి