బెంగళూరు భార్య ప్రియుడి కాల్చివేత: వీడిన మిస్టరీ!
భార్య పైన అనుమానంతో న్యాయవాది అమిత్ కేశవ్ మూర్తిని షూట్ చేసిన కేసులో మిస్టరీ వీడుతోంది. భార్యపై అనుమానంతోనే షూట్ చేసినట్లు తెలుస్తోంది.
బెంగళూరు: భార్య పైన అనుమానంతో న్యాయవాది అమిత్ కేశవ్ మూర్తిని షూట్ చేసిన కేసులో మిస్టరీ వీడుతోంది. భార్యపై అనుమానంతోనే షూట్ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం నగరంలో బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
రాజేశ్, శ్రుతిలు భార్యాభర్తలు. రైల్వే గొల్లహళ్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా శృతి పని చేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా శ్రుతితో న్యాయవాది అమిత్‌కు వివాహేతర సంబంధం ఉందనే రాజేశ్ అనుమానిస్తూ వచ్చాడు.
బెంగళూరు లాయర్ కాల్చివేత: జీపీఎస్ ట్రాకింగ్‌తో భార్యను వెంటాడి..
శుక్రవారం అమిత్, శృతిలు ఒకే కారులో వస్తుండగా వెంబడించిన రాజేశ్, అతడి తండ్రి గోపాలకృష్ణలు హెసరఘట్టరోడ్డులో కారును అడ్డగించారు. తలుపు తెరవాలని రాజేశ్ హెచ్చరించినా అందుకు శ్రుతి నిరాకరించింది. దీంతో రాజేశ్ పిస్టల్‌తో అమిత్‌పై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అంతలోనే రాజేశ్, గోపాలకృష్ణలు పరారయ్యారు.

హుటాహుటిన అమిత్‌ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించిన శృతి, కాసేపటికే అదే ప్రాంతంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను లాడ్జిలో ఉన్నట్లు చెప్పారు.
ఆసుపత్రికి వచ్చేసరికే అమిత్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే పోలీసులు, బంధువులు లాడ్జిని పరిశీలించగా శ్రుతి విగతజీవిగా పడి ఉన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించేసరికే ఆమె మృతి చెందారు.
హత్యకు కారకులైన రాజేశ్, గోపాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయారు. శృతితో అమిత్‌కు వివాహేతర సంబంధం ఉన్నందునే కొన్ని రోజులుగా గొడవలు సాగుతున్నాయని బహిరంగంగా తిరుగుతుండడంతో పిస్టల్‌తో కాల్చినట్లు అంగీకరించారు. కోర్టు ముందు హాజరు పరిచిన పోలీసులు సమగ్ర విచారణ నిమిత్తం పదిహేను రోజుల కస్టడీకి తీసుకున్నారు.
కాగా, పోలీసులు రాజేష్ పైన హత్య కేసు నమోదు చేశారు. గోపాలకృష్ణ కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. లాయర్‌ను చంపింది రాజేష్ అని, ఆయన తండ్రి కాదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications