Bengaluru: యూకేలో ఉద్యోగం, లక్షల్లో జీతం, డిపాజిట్ గా రూ. 34 లక్షలు స్వాహా !

ఈ మెయిల్ ద్వారా ఓ మహిళను సంప్రదించి మీకు యూకేలో ఉద్యోగం వచ్చిందని, వీసా, సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు డిపాజిట్ చెయ్యాలని రూ. 34 లక్షలు డిపాజిట్ చేయించుకి చేతులు ఎత్తేశాడు.

బెంగళూరు: యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తున్న నైజీరియా దేశస్థుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నోకోచా కస్మీర్ ఇకెంబాను బెంగళూరు సిటీ ఈశాన్య విభాగానికి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మెయిల్ ద్వారా ఓ మహిళను సంప్రదించిన నోకోచా మీకు యూకే ఉద్యోగం ఇప్పిస్తామని, వీసా, సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు డిపాజిట్ చెయ్యాలని ఆమెను నమ్మించాడు. తరువాత యూకేలో మీకు ఉద్యోగం వచ్చిందని మాయమాటలు చెప్పి ఆమె నుంచి రూ. 34 లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడు.

తరువాత ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేయడం, పదేపదే కాలం గడపడంతో బాధితురాలు ఈశాన్య విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆరు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, సిమ్ కార్డులు, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు చాలా మందిని ఇలాగే మోసం చేసినట్లు వెలుగులోకి రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా కేసు విచారణ చేస్తున్నారు.

Bengaluru: Nigerian man arrested for cheating woman by promising job in UK.

కర్ణాటకలోని కొడగు పోలీసుల ప్రత్యేక బృందం దాడులు చేసి 2 వేర్వేరు కేసుల్లో మొత్తం 8 మంది ప్రముఖ గంజాయి వ్యాపారులను అరెస్టు చేసి, నిందితుల నుంచి 5 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు కొడగుతో పాటు పొరుగు రాష్ట్రమైన కేరళకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. రామరాజన్ సోమవారం విలేకరులకు చెప్పారు.

కొడుగు జిల్లాలోని విరాజ్‌పేట నగరంలో గంజాయి విక్రయిస్తున్న సాదిక్, ఖలీల్, దర్శన్, ఇలియాస్, కరణ్ కుమార్, గగన్, నిరూప్, వినయ్‌లను. అరెస్టు చేసి మడికేరిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, మడికేరిలో పట్టుబడిన నిందితులు మైసూరులోని మండిమొహల్లా నుంచి గంజాయిని కొనుగోలు చేసి బైక్‌ల ద్వారా కొడుగు జిల్లాకు తీసుకు వచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు అన్నారు. నిందితులు కొడుగు జిల్లాలో కాకుండా కేరళలకు గంజాయి తరలిస్తున్నారని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+