బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్..
దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ కంపెనీలు అధికంగా ఉండటం కారణంగా ఈ నగరం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని నమ్మ మెట్రో 'ఎల్లో లైన్' ప్రారంభానికి సిద్ధమైంది. ఈ లైను రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్) నుంచి బొమ్మసండ్ర ప్రాంతాలను కలుపుతుంది. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లైన్ ఫైనల్ సేఫ్టీ పరీక్షలు త్వరలో చేయనున్నారు. అనంతరం ఈ మెట్రో లైను అందుబాటులోకి రానుంది.
బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్. బెంగళూరులోని నమ్మ మెట్రో 'ఎల్లో లైన్' త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మెట్రో లైను ఈ లైను రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్) నుంచి బొమ్మసండ్ర ప్రాంతాలను కలుపుతుంది. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఫైనల్ టెస్టింగ్ నిర్వహించనున్నారు. జూలై 22 నుంచి జూలై 25 వరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS) ఈ భద్రతా తనిఖీని నిర్వహిస్తారు. అనంతరం ఈ ఎల్లో లైన్ అందుబాటులోకి రానుంది.
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వచ్చే నెల ఆగస్టులో ఈ లైను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. తొలుత ఈ లైన్ లో మూడు రైళ్లు నడుస్తాయని.. అనంతరం రద్దీ దృష్ట్యా రైళ్లు పెరుగుతాయని తెలిపింది. బెంగళూరులో కనెక్టివిటీ మరింత పెంచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, గ్రీన్-పింక్ లైన్స్ డైరెక్ట్ ఇంటర్ చేంజ్‌ను అందించడం ఎల్లో లైన్ ముఖ్య ఉద్దేశమని మెట్రో సంస్థ పేర్కొంది. నగరంలోని ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి ఐటీ సంస్థలకు నిలయంగా ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా ఎల్లో లైన్ వెళుతుందని తెలిపింది.

ఎల్లో లైన్ స్టేషన్లు ఇవే..
RV రోడ్: ఇది గ్రీన్ లైన్‌తో ఇంటర్‌చేంజ్
రాగిగుడ్డ
జయదేవ హాస్పిటల్: ఇది పింక్ లైన్‌తో భవిష్యత్తులో ఇంటర్‌చేంజ్ అవుతుంది
BTM లేఅవుట్
సెంట్రల్ సిల్క్ బోర్డ్
బొమ్మనహళ్లి
హొంగసంద్ర
కుడ్లు గేట్
సింగసంద్ర
హోసా రోడ్
బెరటేన అగ్రహార
ఎలక్ట్రానిక్ సిటీ
కోనప్పన అగ్రహార
హుస్కూర్ రోడ్
హెబ్బగోడి
బొమ్మసాంద్ర (టెర్మినల్)












Click it and Unblock the Notifications