శోభనంలో ఫెయిల్.. రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన భార్య
ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత , ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి. భర్తలను చీట్ చేస్తున్న భార్యలు.. అలాగే భార్యలను చీట్ చేస్తున్న భర్తలు ఘటనలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా మరికొంత మంది మాత్రం ఏకంగా కట్టుకున్నోళ్లకు స్పాట్ పెట్టేస్తున్నారు. తాజాగా బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన భర్తను రూ. 2కోట్లు డిమాండ్ చేసింది. వివాహం జరిగిన మూడు నెలల తర్వాత ఫస్ట్ నైట్ రోజు శారీరక సంబంధం పెట్టుకోలేదన్న కారణంతో ఆ మహిళ తన భర్త నుంచి ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసింది. దీనికి ఆమె కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్ట్ దొరికింది.
కర్ణాటకలోని చిక్కమంగళూరుకి చెందిన ప్రవీణ్, చందన అనే యువతికి ఈ ఏడాది మే 5 న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్ లో నివాసం ఉంటున్నారు. మే 16 ఫస్ట్ నైట్ జరిగింది. అయితే శోభనంలో భర్త ఫెయిల్ అయ్యాడు. తొలి రాత్రి ప్రవీణ్ శారీరక సంబంధానికి నిరాకరించాడు. దీంతో ఈ వివాదం మొదలైంది. ఈ క్రమంలో చందన మెడికల్ టెస్టులు చేయించుకోవాలని భర్తకు చెప్పింది.

అయితే ప్రవీణ్ కు ఎలాంటి లోపం లేదని.. మానసిక ఒత్తిడి కారణంగా సమయం తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. చందన మాత్రం తనపై ఒత్తిడి పెంచి పరిహారంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రవీణ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 17న చందన కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఇంట్లోకి చొరబడి అతనితో పాటు బంధువులపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications