ఖాకీ వదిలి కార్పొరేటర్ అయిన లేడి కానిస్టేబుల్
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో బీజేపీ దే హవా. బీజేపీ నాయకులు సంబరాలలో మునిగిపోయారు. సమాజసేవ చెయ్యడానికి ఖాకీ దుస్తులు వదిలి పెట్టిన మహిళ కార్పొరేటర్ గా విజయం సాధించారు.
బీబీఎంపీ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్ తో పోటి చేసిన జే.ఎం. సవితా ఘనవిజయం సాధించారు. బెంగళూరులోని శ్రీనగర్ వార్డు -156 నుండి సవితా పోటి చేశారు. ఈ వార్డులో 36,982 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 18,793, మహిళా ఓటర్లు 17,252 మంది ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిపై సవితా ఘనవిజయం సాధించారు. తండ్రిలాగే సమాజసేవ చెయ్యడానికి రాజకీయాలలోకి వచ్చానని సవితా అన్నారు. వార్డు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సవితా తెలిపారు.
అనేక సంవత్సరాలు మహిళా పోలీస్ స్టేషన్ లో, డీజేపీ కేంద్ర కార్యాలయంలో సవితా కానిస్టేబుల్ గా పని చేశారు. ఆమె మంచితనాన్ని గుర్తించిన బీజేపీ నాయకులు రాజకీయాలలోకి రావాలని సూచించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాకీ దుస్తులు వదిలి పెట్టిన సవితా ఇప్పుడు ఖద్దర్ దుస్తులు వేసుకుని కార్పొరేటర్ అయ్యారు.












Click it and Unblock the Notifications