బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో రూ. 8 కోట్ల కుక్క కిడ్నాప్, పట్టిస్తే రూ. 1 లక్ష గిఫ్ట్, భారత్ లో మూడే కుక్కలు, టైం చూసి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో 3 సంవత్సరాల 6 నెలల ఖరీదైన అలస్కన్ మలముటే బ్రీడ్ కుక్క కిడ్నప్ కు గురైయ్యింది. తన కుక్క ఆచూకి చెప్పిన వారికి రూ. 1 లక్ష బహుమానం ఇస్తామని కుక్క యజమాని ప్రకటించారు. కుక్క కిడ్నాప్ కు గురైయ్యిందని కేసు నమోదు కావడంతో బెంగళూరు పోలీసులు సైతం ఆ కుక్క కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ కు గురైన కుక్క అక్షరాల రూ. 8 కోట్లు. భారతదేశంలో ఆ జాతి కుక్కలు మూడు మాత్రమే ఉన్నాయి. ఆ మూడు కుక్కల్లో బెంగళూరులో కిడ్నాప్ గురైన ఈ కుక్క ఒకటి కావడం విశేషం.

ఆన్ లైన్ లో డీలింగ్, బెంగళూరు అమ్మాయిలకు భలే గిరాకి, చెన్నై అపార్ట్ మెంట్ లో హైటెక్ వ్యభిచారం!ఆన్ లైన్ లో డీలింగ్, బెంగళూరు అమ్మాయిలకు భలే గిరాకి, చెన్నై అపార్ట్ మెంట్ లో హైటెక్ వ్యభిచారం!

చైనా కుక్క అంత ఖరీదా!

చైనా కుక్క అంత ఖరీదా!

చైనా దేశానికి చెందిన అలస్కన్ మలముటే బ్రీడ్ ( జాతి)కు చెందిన ఎరుపు, తెలుపు రంగుల మిశ్రమం కలిగిన ఈ కుక్కను మూడు సంవత్సరాల క్రితం బెంగళూరు నగరంలోని శ్రీనగర్ కు చెందిన సతీష్ అనే వ్యక్తి రూ. 3 కోట్లు చెల్లించి ఖరీదు చేశాడు. తరువాత ఆ కుక్కను బెంగళూరుకు తీసుకు వచ్చిన సతీష్ దానిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

ఇంటి ముందే కిడ్నాప్?

ఇంటి ముందే కిడ్నాప్?

ఇటీవల సతీష్ కుటుంబ సభ్యులు కుక్కను ఇంటి ముందు చైన్ తో కట్టేశారు. తరువాత సతీష్ కుటుంబ సభ్యులు ఇంటిలో వారి పని వారు చూసుకుంటున్నారు. తరువాత బయటకు వచ్చి చూడగా చైన్ తో సహ తమ కుక్క మాయం అయ్యిందని లబోదిబో అన్నారు.

భారత్ లో మూడే కుక్కలు

భారత్ లో మూడే కుక్కలు

చుట్టు పక్కల కుక్క కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో సతీష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. ఆ రోజు పూర్తిగా కుక్క కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో వాటి ఫోటోలు తీసుకుని బెంగళూరు నగరంలోని హనుమంతనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలస్కన్ మలముటే జాతి కుక్కలు భారత్ లో మూడు మాత్రమే ఉన్నాయి. ఆ మూడు కుక్కల్లో బెంగళూరు నగరంలో కిడ్నాప్ అయిన సతీష్ కుక్క ఒక్కటి కావడం విశేషం.

భారీ బహుమానం

భారీ బహుమానం

అలస్కన్ మలముటే జాతి కుక్కలు చైనాలో ఎక్కువగా ఉంటాయి. చైనా నుంచి ప్రత్యేకంగా ఆ కుక్కను సతీష్ భారత్ తీసుకు వచ్చి చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. కిడ్నాప్ అయిన కుక్క విలువ రూ. 8 కోట్లు ఉంటుందని సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుక్క ఆచూకి చెప్పిన వారికి అక్షరాల రూ. 1 లక్ష చెల్లిస్తానని సతీష్ మనవి చేశాడు.

డాగ్ షోల్లో భలే క్రేజ్

డాగ్ షోల్లో భలే క్రేజ్

ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ లతో పాటు సోషల్ మీడియాలో ఆ కుక్క ఫోటోలు షేర్ చేసిన సతీష్ తన కుక్క ఆచూకి చెప్పాలని అందరికీ మనవి చేస్తున్నాడు. కిడ్నాప్ కు గురైన సతీష్ కుక్క కొంత కాలం నుంచి అనేక డాగ్ షోలలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బెంగళూరు పోలీసులు సైతం మాయం అయిన కుక్క ఫోటోలు చేత పట్టుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో దాని కోసం గాలిస్తున్నారు.

English summary
Bengaluru Srinagar resident field the complaint for missing 3 year old Alaskan Malamute dog. He announced 1 lahk price for the person who find the dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X