ఐటి సిటీలో టెక్కీని కారులోంచి లాగి చంపేశారు

హతుడు కేరళకు చెందిన ప్రజీత్ ఆనంద్. అతను తన తల్లిదండ్రులతో కలిసి ఆర్‌కె పురం సమీపంలోని అయ్యప్ప నగర్‌లో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుదవారం రాత్రి గం.9.15 నిమిషాల ప్రాంతంలో స్థానికులు రక్తం మడుగులో పడి ఉన్న ప్రజీత్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రజీత్ మెడపై గాయం కనిపించింది. దీంతో అతన్ని నరికి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్యాలయం నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రజీత్ ఇంటికి తిరిగి వచ్చాడు. మిత్రుల వద్దకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లాడు.
డ్రైవింగ్ చేస్తుండగా ఆపేసి అతన్ని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సాయుధ దోపిడీ దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, టెక్కీకి సంబంధించినవేవీ పోలేదు.












Click it and Unblock the Notifications