'వాడు నన్ను కత్తితో పొడిచాడు డార్లింగ్': సిడ్నీలో మరణించే ముందు భర్తతో చెప్పిన బెంగుళూరు టెక్కీ
బెంగుళూరు: ఆస్ట్రేలియాలో ఓ భారత మహిళ ఐటీ కన్సల్టెంట్ దారుణ హత్యకు గురయ్యారు. సిడ్నీ శివారులోని వెస్ట్ మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిన్నర గంటల ప్రాంతంలో బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్‌కుమార్(40)ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు.
పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై పారామట్టా పోలీస్ అధికారి వేన్ కాక్స్ మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా తమకు తెలియజేసి కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు.
Sydney murder - I am in constant touch with our Consulate in Sydney. The Consulate is providing all help.
— Sushma Swaraj (@SushmaSwaraj) March 9, 2015 వివరాల్లోకి వెళితే... ఆఫీసు విధులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె మేనల్లుడు త్రిజేష్ తెలిపారు. ఆమె ఇంటికి 300 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె బెంగుళూరులోని తన భర్త అరుణ్‌తో ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తుండగా దుండగుడు తనను వెంబడిస్తున్నాడని చెప్పిందని తెలిపారు.
'నన్ను వెళ్లనివ్వండి, కావాలంటే నా బ్యాగ్ తీసుకోండి, ఇంకా ఏమి కావాలన్నా ఇస్తాను' అని చెప్పడంతో పాటు 'వాడు నన్ను కత్తితో పొడిచాడు డార్లింగ్' అని తన భర్తకు చెప్పిందని ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు చెప్పారు. ప్రభా అరుణ్‌కుమార్‌కు భర్త, తొమ్మిది సంవత్సరాలు కూతురు ఉన్నారు.

సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ వెంటనే అప్రమత్తమయ్యారని, ఘటనపై తగిన చర్యలు తీసుకుంటున్నారని విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభా అరుణ్‌కుమార్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న భర్త అరుణ్ ఆస్టేలియాకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications