ప్రియుడి బెదిరింపులు: ప్రియురాలి సజీవదహనం
బెంగళూరు: ఓ యువకుడి ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ఒంటికి నిప్పంటించుకుని సజీవ దహనమైంది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనతా కాలనీ జగ్జీవన్ రాంనగర్‌కాలనీలో బాధిత బాలిక సౌందర్య(15) తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. కాగా, ప్రవీణ్(19) అనే యువకుడు ఆమెను పరిచయం చేసుకున్నాడు. పక్క పక్కనే వీరి ఇళ్లు ఉండటం, ఒకరి కుటుంబాలు ఒకిరిక తెలిసి ఉండటంతో ఆ బాలికతో పరిచయం పెరిగింది.
కొద్ది నెలల క్రితం ప్రవీణ్, సౌందర్య ప్రేమలో పడ్డారు. తాను సౌందర్యను పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకు చెప్పాడు ప్రవీణ్. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు సౌందర్య వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లి ప్రాదన పెట్టారు. సౌందర్ ఇంకా మైనర్ అని, ఇప్పుడే వివాహం చేసే ఆలోచన లేదని సౌందర్య తల్లిదండ్రులు తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో సౌందర్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని, ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ వేధింపులు తాళలేక సౌందర్య నిప్పంటించుకుని సజీవ దహనమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ప్రవీణ్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సౌందర్య తన మరణ వాంగ్మూలంలో పోలీసులకు తెలిపింది. నిందితుడు ప్రవీణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications