పైసా వసూల్ ..! వారం రోజుల్లో రూ.72 లక్షల జరిమానాలు.. ఎక్కడో తెలుసా...?
కేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.. కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి నిబంధనకు వేల రూపాయల జరిమానాలు విధిస్తుండడంతో వాహనదారులు ఖంగు తింటున్నారు..ఈ నేపథ్యంలోనే కొత్త ట్రాఫిక్ రూల్సును అమలు చేస్తున్న రాష్ట్రాలు ఒక్కో వాహనం పై వేలాది రుపాయాలు వేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా జరిమానాల రూపంలో కేవలం వారం రోజుల్లోనే సుమారు 72 లక్షల రుపాయలను బెంగళూరు నగర పోలీసులు వాహన దారులపై జరిమానాలు విధించి రికార్డ్ సృష్టించారు.

కొత్త చట్టంతో వాహనదారుల్లో గుండెళ్లో రైళ్లు
కేంద్ర నూతన మోటారు సవరణ చట్టం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కాసులను కురిపిస్తోంది. ఆర్ధిక మాంద్యంతో అల్లాడుతున్న రాష్ట్రాలు, ట్రాఫిక్ నిబంధనలు అడ్డం పెట్టుకుని ఆదాయాన్ని అర్జిస్తున్నారా అన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు హూటాహుటిన కేంద్రం తీసుకువచ్చిన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు మరో ఆలోచన లేకుండా అమల్లోకి తెచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహాన దారులు ఏ చిన్న నిబంధన అతిక్రమించిన వేల రుపాయలతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. నూతన చట్టంతో ట్రాక్టర్లు, ఆటోలు ఒకేటేమిటి టూ వీలర్‌పైనే కనీసం పదివేలకు మించకుండా జరిమానాలు విధిస్తున్న పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తోంది.

హడలెత్తించిన బెంగళూరు పోలీసులు
ఈనేపథ్యంలోనే బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం జరిమానాలు విధించడంతో రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త మోటారు చట్టం అమల్లోకి రావడంతో వెంటనే రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు ప్రజలపై భారీ జరిమానాలు విధించారు. వారం రోజుల్లోనే సుమారు 75 లక్షలకు పైగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహానదారులపై జరిమానాలు విధించినట్టు నగర పోలీసులు తెలిపారు. కాగా ఈ జరిమానాలను మొత్తం 6,813 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను రిజిస్టర్ చేసి వాహనదారుల వద్ద నుంచి అంత మొత్తాన్ని రాబట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ఉండటం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వన్‌వే రూట్‌లో రావడం తదితరాల నుంచి జరిమానాలు ఎక్కువగా వసూలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

అధిక జరిమానాలపై మిశ్రమ స్పందన
ఇక బెంగళూర్‌లోని ఈ వసూళ్లపై మిశ్రమ స్పందన లభిస్తోంది. భారీ జరిమానల వల్ల ప్రజల్లో మార్పులు వస్తాయని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతుండగా ఇది ఎక్కువగా మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని మరికొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ట్రాఫిక్ పోలీసుల తీరుతో కూడ కొంత ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు వాహానాదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన చట్టాన్ని బీజేపీయోతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ తోపాటు తెలుగు రాష్ట్రాలు కూడ అమలు చేసేందుకు వెనకడుగు వేశాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications